ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లిదండ్రులు మందలించారని బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN, Publish Date - May 15 , 2025 | 12:20 AM

పరీక్షా ఫలితాలు ఆశించి నట్లుగా రాలేదని తల్లిదండ్రులు మందలించినందుకు బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఘటన

కోదాడ రూరల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): పరీక్షా ఫలితాలు ఆశించి నట్లుగా రాలేదని తల్లిదండ్రులు మందలించినందుకు బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో బుధవారం జరిగింది. కోదార రూరల్‌ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ గ్రామానికి చెందిన చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కీర్తి ఉపేందర్‌ కుమారుడు కీర్తి వివేక్‌ (20) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలలో బీటెక్‌ సివిల్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మెదటి సెమిస్టర్‌ ఫలితాలను మంగళవారం ఆన్‌లైన్‌లో పరిశీలించడగా మూడు సబ్జెక్టులో ఫెయిలయ్యాడు. లక్షలు ఖర్చు చేసి చదివిస్తున్నా, చదువపై దుష్టి సారించనదున మంచి ఫలితాలు రాలేదని, వేసవి సెలవుకు ఇంటికి వచ్చిన కుమారుడిని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన వివేక్‌ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గుడిబండ గ్రామంలో తన ఇంట్లోని బాత్‌రూంకు వెళ్లి డోర్‌ పెట్టుకుని కత్తితో మెడ మీద, ఎడమ చేయి మీద కోసుకుని రక్తస్రావమై మృతి చెందాడు. తండ్రి ఆ సమయంలో శిక్షణ కోసం సూర్యాపేటకు వెళ్లాడు. మృతుడి తండ్రి ఉపేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్‌ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 15 , 2025 | 12:20 AM