నల్లమట్టి కొల్లగొట్టి..
ABN, Publish Date - May 26 , 2025 | 12:02 AM
చెరువు మట్టి కొల్లగొడుతున్నారు. కొన్ని ట్రిప్పులకే అనుమతి తీసుకొ ని వందలాది ట్రిప్పుల మట్టి యథేచ్ఛగా తరలిస్తున్నా రు.
కొన్ని ట్రిప్పులకే అనుమతి
వందలాది ట్రిప్పులు తరలింపు
దేవరకొండ పర్వతాలు చెరువు నల్లమట్టి తరలింపు
చింతపల్లి, మే 25(ఆంధ్రజ్యోతి): చెరువు మట్టి కొల్లగొడుతున్నారు. కొన్ని ట్రిప్పులకే అనుమతి తీసుకొ ని వందలాది ట్రిప్పుల మట్టి యథేచ్ఛగా తరలిస్తున్నా రు. దేవరకొండ పర్వతాలు చెరువు నుంచి మట్టిని సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి నేరు గా చింతపల్లి మండలంలోని గొల్లపల్లి, కుర్మేడ్, నసర్లపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 5గంటల లోపు తరలించాలి. కానీ రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి తరలుతోందని స్థానికు లు పేర్కొంటున్నారు. 50 ట్రిప్పులకు అనుమతి తీసుకొని 500 ట్రిప్పుల వరకు తరలిస్తున్నారని చెబుతున్నారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అర్కపల్లి నుంచి హైదరాబాద్‌కు కూడా నల్లమట్టి ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. ఐదు టిప్పర్ వాహనాల్లో రాత్రి పగలు తేడా లేకుండా హైదరాబాద్-సాగర్ రహదారిపై తరలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అర్కపల్లి నుంచి మాల్ మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా రెండు టిప్పర్లను ఈ నెల 21వ తేదీన యాచారం పోలీసులు పట్టుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మాడ్గుల మండలం నుంచి కులకులపల్లి నుంచి నేరుగా కుర్మేడ్, గొల్లపల్లి, మీదుగా తరలిస్తున్న టిప్పర్లను కుర్మేడ్ గ్రామస్థులు అడ్డుకొని పోలీ్‌సస్టేషన్‌కి తరలించారు. పాత మాల్ నుంచి యాచారం మండలం మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తున్న టీప్పర్లను పోలీసులు పట్టుకున్నారు.
అధిక లోడ్‌తో టిప్పర్లు
టిప్పర్ల ద్వారా నల్లమట్టిని తరలిస్తుండగా అధిక లోడ్‌తో సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై జోరుగా రాకపోకలు కొనసా గిస్తున్నారు. సాగర్-హైవేపై మట్టి కిందపడిపోవడంతో రహదారి పూర్తిగా మట్టితో నిండి పోతుంది. రోడ్డుపై నల్లమట్టి పడడం తో కొద్దిపాటి వర్షానికి రహదారి పూర్తిగా బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారు లు ఈ రహదారిపై వెళ్తూ అదుపుతప్పి పడుతున్నారు. నల్లమట్టి తరలింపుపై రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.మైనింగ్ అధికారులు మాత్రం మట్టి రవాణాపై అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు.
అధికారులు స్పందించాలి
మండలంలోని గొల్లపల్లి, నసర్లపల్లి, తిర్మాలపురం, గొల్లపల్లి, కుర్మేడ్, వింజమూర్, ఉప్పరపల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలి. ఇటుక బట్టీల నుం చి వెలువడే దుమ్ముదూళి వల్ల శ్వాసకోస వ్యాధు లు సోకే ప్రమాదం ఉంది. ఊరికి దూరంగా ఏర్పా టు చేసుకుంటే వ్యాధులు ధరిచేరే అవకాశం ఉండదు.
- ఎండీ. రషీద్, వీటీనగర్, చింతపల్లి మండలం.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. మట్టి తరలించే ముందు నాలా అనుమతి తీసుకొని వాహనాలకు వే బిల్ పత్రాలు ఉంచుకొని మట్టి తరలించాలి. రాత్రి వేళ మట్టి తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
- రమాకాంత్‌శర్మ, చింతపల్లి తహసీల్దార్.
Updated Date - May 26 , 2025 | 12:02 AM