Maha Shivratri: రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ABN, Publish Date - Feb 24 , 2025 | 06:48 PM
మహా శివరాత్రిని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారు. శివరాత్రి రోజున హిందువులందరూ తాను చెప్పినట్లు చేయాలని పిలుపునిచ్చారు. మరి ఆయన ఏం చెప్పారో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..
MLA Rajasingh
హైదరాబాద్, ఫిబ్రవరి 24: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా హిందువులు అందరూ తప్పకుండా హిందువుల వద్దనే పూజ సామాన్లు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రోజుల తరబడి స్నానం చేయకుండా.. గొడ్డు మాంసం తిని అమ్ముతున్న వాళ్ల దగ్గర మహా శివరాత్రికి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Updated Date - Feb 24 , 2025 | 06:48 PM