ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల మేలు కోసమే ‘భూభారతి’

ABN, Publish Date - Apr 25 , 2025 | 12:52 AM

భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి స త్యం అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సత్యం, చిత్రంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

రైతుల మేలు కోసమే ‘భూభారతి’

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చండూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి స త్యం అన్నారు. చండూరులో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని, భూములున్న రైతులు తమ భూమి భద్రంగా ఉంద ని తమ గుండెపై చేయి చేసుకుని నిద్ర పోవాలన్న లక్ష్యంతో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని గుర్తు చేశా రు. ప్రతీ మండలానికి ఒక సర్వేయర్‌ను నియమించాలని కో రారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణిని ప్రారంభించడంతో రైతు లు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి లో భూములు ఉన్నవారికి పట్టాలు ఇవ్వడం, ఆనలైనలో నమో దు వంటివి పూర్తి చేసి సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. శివన్నగూడెం ప్రాజెక్టు రిజర్వాయర్‌ ఉన్నా గత ప్రభుత్వం డీపీఆర్‌ చేపట్టలేదని, ప్రసుత్త ప్రభుత్వం రూ. 18 కోట్లతో ఏదుళ్ల నుంచి నీళ్లు తెచ్చే కార్యక్రమం చేపట్టిందన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆయా మండలాల్లో భూముల వివరాలన్నింటినీ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామని వెల్లడించారు. నూటికి నూరు శాతం రైతులకు మేలు చేకూర్చే భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్‌ దశరథ, మార్కెట్‌ కమిటీ చైర్మన దోటి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:52 AM