నీటి కోసం భగీరథ యత్నం
ABN, Publish Date - May 10 , 2025 | 11:57 PM
కరువు ఛాయలు.. నీటి ల భ్యత లేదు.. అయినా సాగు చేయాలి ఎలా అని తర్జన భర్జన పడిన రైతు నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేశాడు.
నీటి కోసం భగీరథ యత్నం
నాలుగు కిలోమీటర్లకు పైగా పైప్‌లైన
రూ. 20లక్షలకు పైగా ఖర్చు
చిట్యాల, మే 10(ఆంధ్రజ్యోతి): కరువు ఛాయలు.. నీటి ల భ్యత లేదు.. అయినా సాగు చేయాలి ఎలా అని తర్జన భర్జన పడిన రైతు నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేశాడు. ఎలాగైనా సాగు చేయాలని గట్టిగా సంకల్పించుకుని ఏకంగా నాలు గు కిలోమీటర్లకు పైగా పైప్‌లైన వేశాడు. రూ. 20లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. చిట్యాలకు చెందిన కొంతం సత్తిరెడ్డి అనే రైతుకు ఏడు ఎకరాల భూమి లో రెండు బోర్లు వేశాడు. అందులో ఒక బోరు పూర్తి గా ఎండిపోగా మరొక బోరులో కొద్ది నీరు మాత్రమే వస్తుంది. నీటి కోసం బోర్లు వేద్దామంటే నీళ్లు పడతాయనే గ్యారంటీ లేదు. ఎందుకంటే తన పొలం చుట్టూ ఉన్న రైతులలో కొంతం యాదగిరిరెడ్డి ఆరు బోర్లు వేస్తే నీటి చుక్క పడలేదు. అలాగే పెద్దవోని లక్ష్మయ్య రెండు బోర్లు వేస్తే నీరు పడలేదు. దీంతో ఆయనకు బోర్లు వేస్తే నీరు పడదు అనవసరంగా డబ్బులు దండగ అని నిర్ణయించుకుని శాశ్వత పరిష్కా రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మరో రైతు కనగవేలు సహాయం తీసుకున్నాడు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దకాపర్తి చెరువు పక్కన ఉన్న రైతు వ్యవసాయ భూమిని ఎంచుకున్నాడు. పిలాయిపల్లి కాల్వ ద్వా రా చెరువు ఎప్పుడు నిండి ఉండటంతో బావిలో కూడా ఎప్పుడు నీరు ఉంటుంది. రూ. 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పె ట్టి ఆ బావి నుంచి తన పొలం వరకు నాలుగు కిలోమీటర్ల మే ర ఎక్స్‌కవేటర్ సహాయంతో పైప్‌లైన వేశాడు. బావిలో 5 హెచపీ రెండు మోటార్లు వేసి నీరు తోడుకొస్తున్నాడు. ఆయన సంకల్పం ముందు కరువు తలవంచింది. పైప్‌లైన ద్వారా వస్తున్న నీటితో పాంపాండ్‌లను నింపుతున్నాడు. ఈ నీటితో సుమారు 20 ఎకరాలు సాగు చేయనున్నట్లు సత్తిరెడ్డి తెలిపారు.
నీరుంటే సిరులు పండించవచ్చు
నీరుంటే సిరులు పండించవచ్చు. గ తంలో ఏడాది, రెండు, మూడేళ్ల వరకు నీటి లభ్యత ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఏడాది వర్షాలు పడకపోతే నీరు లభించడం లేదు. భూగర్భజలాలను ఇష్టం వచ్చినట్లు తోడేస్తుండటంతో బోర్లు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం నీటి లభ్యతపై దృష్టి సారించాలి.
- కొంతం సత్తిరెడ్డి, చిట్యాల
Updated Date - May 10 , 2025 | 11:58 PM