యోగాతోనే మెరుగైన ఆరోగ్యం
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:34 PM
యో గాతో మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, యోగానే జీవి తంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ కుమార్ పే ర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరిక్రిష్ణలతో కలిసి అంతర్జాతీయ యోగాదినోత్సవ గో డప్రతులను విడుదల చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలకలెక్టరేట్, జూన్16 (ఆంధ్రజ్యోతి): యో గాతో మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని, యోగానే జీవి తంలో భాగంగా చేసుకోవాలని కలెక్టర్ కుమార్ పే ర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరిక్రిష్ణలతో కలిసి అంతర్జాతీయ యోగాదినోత్సవ గో డప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు నిత్యం యోగ చేసేందుకు సమయం కే టాయించాలన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవా లంటే యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈనె ల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఆయు ష్‌శాఖ ఆధ్వర్యంలో వంద ఆయుష్మాన్, ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరం ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా నినాదంతో ప్ర పంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నా రన్నారు. జిల్లాలో నిర్వహించే యోగా దినోత్సవ కార్య క్రమాల్లో స్వచ్చంద సంస్థలు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఆయుష్‌శాఖ వైద్యాధికారి పద్మజ, మెడికల్ అధికా రులు మేఘన, క్రిష్ణబాయి, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణలతో క లిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పొన్నారం, దండేపల్లి, మందమర్రి, జన్నారం, జైపూర్, హాజీపూర్, కాసిపేట, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి వచ్చి న ప్రజలు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్ర మంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:34 PM