ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 11:38 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరు గైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమా ర్‌దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని చెర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కన్నెపల్లి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరు గైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమా ర్‌దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని చెర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు, కార్పోరే ట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్య అందుతుందన్నారు. అనంతరం మం డల కేంద్రంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కన్నె పల్లిలోని కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్‌లు, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. మెను ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించా లని, ఆహారం తయారీలో నిబంధనలు, శుభ్రత పాటించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరగా నిర్మాణాలను ప్రారంభించాలని తెలిపారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థుల తో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు నాణ్యమైన భోజ నం విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మిషన్ భగీ రథ నీరు రావడం లేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను వెంటనే పరిష్కరించి నీటిని అందించాలని అధికారులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఎత్తు, బరువు కొలతలను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏపీవో శ్రీనివాస్, కార్యదర్శి రాజ్‌కుమార్, కాంగ్రెస్ నాయకుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ఇసుకను వేగంగా అందించాలి
మంచిర్యాల కలెక్టరేట్ : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను త్వరగా అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగ ళవారం కలెక్టర్ చాంబర్‌లో నీటి సరఫరా, రోడ్లు భవనాలు, ఇంజనీరింగ్ అధి కారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుకను టీజీఎం డీసీ ఆధ్వర్యంలో అందించాలని, పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికా రులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పనులకు అవసరమైన కంకరను జీరో పర్మిట్ సిస్టమ్ ద్వారా వాహనాలకు వేబిల్ ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 11:39 PM