ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: అనంతగిరికి అందాల భామలు..

ABN, Publish Date - Feb 27 , 2025 | 09:47 AM

తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి(Anantagiri) కొండలను వివిధ దేశాల అందాలభామలు సందర్శించనున్నారు. పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతైన వంపులతో చూడగానే మనసు మైమరిచిపోయే ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అనంతగిరి కొండల అందాలను ఆస్వాదించనున్నారు.

- మేలో హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్‌ పోటీలు

వికారాబాద్‌: తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి(Anantagiri) కొండలను వివిధ దేశాల అందాలభామలు సందర్శించనున్నారు. పచ్చని చెట్లు.. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతైన వంపులతో చూడగానే మనసు మైమరిచిపోయే ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అనంతగిరి కొండల అందాలను ఆస్వాదించనున్నారు. మే నెలలో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న మిస్‌వరల్డ్‌(Miss World) పోటీలకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హాజరుకానున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో శాంతి..


ప్రపంచ నలుమూలల నుంచి సుందరీమణులు పాల్గొనే మిస్‌ వరల్డ్‌ పోటీలకు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యావరణ పర్యాటక కేంద్రం (ఎకో టూరిజం)గా అనంతగిరిని అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే సుందరీమణులతో పాటు ఆయా దేశాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను అనంతగిరి కొండలకు తీసుకువచ్చి వారు ఇక్కడి పర్యావరణ అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించనున్నారు.


ఈ పోటీల్లో 140 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొననున్నారు. సుందరీమణుల పర్యటించే ప్రాంతాలు నేడు ఖరారు కానున్నాయి. అనంతగిరి కొండలను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదించడం వరకే పరిమితం చేస్తారా? లేక మిస్‌వరల్డ్‌ పోటీలకు సంబంధించి ఏదైనా ఒక థీమ్‌తో ఈవెంట్‌ నిర్వహణకు అనంతగిరి కొండలు(Ananthagiri Hills) వేదిక కానున్నాయా అనేది గురువారం నాటికి స్పష్టత రానుంది.


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 09:47 AM