ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - May 18 , 2025 | 12:23 AM

ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసే విత్తనాలపై అప్రమతంగా ఉండాలని, ఆసక్తికరమైన, ప్రకటనలు తక్కువ ధరకే అందిస్తామనే మోసపూరిత ప్రకటనలతో విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని మండల వ్యవసాయాధికారి పద్మ రైతులకు సూచించారు.

మేళ్లచెర్వులో విత్తనాల దుకాణాలను తనిఖీ చేస్తున్న సీఐ రజితారెడ్డి

మేళ్లచెర్వు, మే 17(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసే విత్తనాలపై అప్రమతంగా ఉండాలని, ఆసక్తికరమైన, ప్రకటనలు తక్కువ ధరకే అందిస్తామనే మోసపూరిత ప్రకటనలతో విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని మండల వ్యవసాయాధికారి పద్మ రైతులకు సూచించారు. మండల కేంద్రంలో పలు విత్తనాల కంపెనీల షాపుల్లోని విత్తనాలను శనివారం సీఐ రజితారెడ్డితో కలిసి శనివారం తనిఖీలు నిర్వహించారు. అనం తరం స్థానిక పోలీసుస్టేషన్‌లో పోలీసు, వ్యవసాయ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు పంట కాలం ముగిసే వరకు విత్తనాల రసీదులను, ఖాళీ ప్యాకెట్లను, పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల పట్ల అధికారులకు సమాచారం అందించాలన్నారు. వ్యవసాయాధికారి పద్మ మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే వరి, పత్తి, మిర్చి విత్తనాల కొనుగోలులో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. నాణ్యమైన విత్తనాలతోనే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలపై రైతులకు అనుమానాలు ఉంటే శాంపిల్స్‌ సేకరించి నాణ్యత పరీక్షిస్తామని తెలిపారు. నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ పరమేష్‌, ఏఈవోలు, భవాని, భవన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:23 AM