ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

న కిలీ విత్తనాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - May 28 , 2025 | 12:30 AM

నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాలు ఇస్తే అధికారుల దృష్ఠికి తీసుకురావాలని వన్‌ టౌన్‌ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

నల్లగొండలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

నల్లగొండ, మే 27(ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాలు ఇస్తే అధికారుల దృష్ఠికి తీసుకురావాలని వన్‌ టౌన్‌ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆరు ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిష్టర్‌ను పరిశీలించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కనగల్‌: రైతులకు నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలుం టాయని చండూర్‌ సీఐ ఆదిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కనగల్‌ ఎక్స్‌ రోడ్డులోని అన్నదాత ఎరువుల దుకాణం, అగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని తని ఖీ చేశారు. దుకాణదారులను అడిగి స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. లైసె న్స్‌తో పాటు, రికార్డులను పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ రైతులు ధళా రులను నమ్మి మోసపోవొద్దన్నారు. లైస్సెన్స్‌ గల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరు వులు మ ందులను కొనుగోలు చేయాలన్నారు. విత్తన సంచులపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి సమగ్ర వివరాలను సరి చూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన మందులు, ఎరువులు, విత్తనాలకు రశీదు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విష్ణుమూర్తి, ఏఈఓలు నవీన్‌, మౌనిక తదితరులున్నారు.

కట్టంగూరు: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కట్టంగూరు ఎస్‌ఐ రవీందర్‌ హెచ్చరించారు. కట్టంగూరులో మంగళవారం ఎరు వుల దుకాణాలను, పురుగుల మందులు విక్రయించే దుకాణాలను కట్టంగూరు ఏవో గిరిప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని కష్టపడి పనిచేసే రైతుకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లదే అన్నారు.

మర్రిగూడ: ఎరువుల దుకాణాల్లో పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన అనం తరం రైతులు ఆయా దుకాణాల యజమానుల నుంచి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సహాస్‌ అన్నారు. మంగళవారం మర్రిగూడ వ్యవసాయ కార్యాలయంలో మాట్లాడుతూ 22 ఎరువుల దుకాణాలు ఉన్నాయని ప్రస్తుతం 15వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా యన్నారు. అనుమానంగా ఉన్న ఫెర్టి లైజర్‌ షాపులకు వెళ్లి తనిఖీలు చేశామని, ఆ షాపుల్లో పత్తి విత్తనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

Updated Date - May 28 , 2025 | 12:30 AM