ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-కల్వర్టుల వద్ద... జర జాగ్రత్త

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:12 PM

దేశాభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తుం టాయి. కానీ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పలు రోడ్లు నరకానికి నకళ్లుగా మారుతు న్నాయి. మారుమూల ప్రాంతాల వాసులు ఏవైనా అత్యవసర పనుల కోసం మండల, జిల్లా కేంద్రాలకు రావాలంటే గతుకులమయమైన, కంకర తేలిన, దారుల్లో అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే రోడ్లు అధ్వా నంగా మారాయి.

జైనూర్‌ మండలం లెండిగూడ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు

- గుంతల రోడ్లపై రాకపోకలకు అవస్థలు

జైనూర్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తుం టాయి. కానీ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పలు రోడ్లు నరకానికి నకళ్లుగా మారుతు న్నాయి. మారుమూల ప్రాంతాల వాసులు ఏవైనా అత్యవసర పనుల కోసం మండల, జిల్లా కేంద్రాలకు రావాలంటే గతుకులమయమైన, కంకర తేలిన, దారుల్లో అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే రోడ్లు అధ్వా నంగా మారాయి. ఆయా రోడ్లపై ఎప్పుడో నిర్మించిన కల్వర్టులు పూర్తి స్థాయిలో దెబ్బతిన డంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అవి రోడ్లకు సమాంతరంగా ఉండడంతో రాత్రి సమయాల్లో సరిగ్గా కనబడక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

- పవర్‌గూడ నుంచి జైనూర్‌ వరకు..

జైనూర్‌ మండలంలోని పవర్‌గూడ నుంచి జైనూర్‌ టింకాపెల్లి వరకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో సుమారు 14 చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి ఉండడంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల పవర్‌గూడ సమీపంలో ఏర్పడిన గుంతలో ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి పడి పోయిన ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాలు జరుగుతున్నా గుంతలు పూడ్చేందుకు అధికారులు చర్యల తీసుకోక పోవడంపై వాహనదారులు మండిపడుతున్నారు. గుంతల కారణంగా రోడ్డు కనబడక పోవడం మూలంగా వాహనాలు చెడి పోవడంతో పాటు గాయాల పాలవుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వాహనాలతో ఇతర ప్రాంతా లకు వెళ్లాలన్నా తమకు రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నారు. సంబంధిత అధికా రులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇటీవల ఆటో తెల్లవారు జామున ఆశ్రమ పాఠశాలలో వంట చేసే సిబ్బందిని తీసుకెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి గుంతలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందు తున్నట్లు సమాచారం. ఆటో సైతం పూర్తిగా దెబ్బతి న్నదని యజమాని వాపోతున్నాడు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు సత్వరమే రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలని లేండిగూడ సమీపంలో ఉన్న కల్వర్టు రోడ్డుకు సమాంతరంగా ఉండటంతో వాహనదారులు రాత్రి సయయాల్లో వాహనాలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని జామ్ని కల్వర్టు సైతం రోడ్డుకు ఎత్తుగా లేక పోవడం, సమాంతరంగా ఉండడం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదా రులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కల్వర్టుల వద్ద ప్రమాద సూచకలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చి వేయాలని ప్రజలు కోరుతున్నారు.

తరుచుగా ప్రమాదాలు..

డోంగ్రే సమాధాన్‌, మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా చైర్మన్‌

జైనూరు మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై కల్వర్టుల వద్ద గుంతల పడి తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రి వేళల్లో అయితే ద్విచక్ర వాహనదా రులు మ రింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మ తులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jun 27 , 2025 | 11:12 PM