kumaram bheem asifabad- ‘బడిబాట’ సక్సెస్
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:17 PM
పిల్లలను బడుల్లో చేర్పించడానికి ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టిన బడిబాట సత్ఫాలితాలనిచ్చింది. ఇప్పటి వరకు బడి ముఖం చూడని వారితో పాటు వివిధ కారణాల వల్ల చదువు మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్చడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
- ఫలించిన ఉపాధ్యాయుల కృషి
- సర్కారు బడులవైపు తల్లిదండ్రుల చూపు
- పాఠశాలల్లో మెరుగుపడుతున్న సౌకర్యాలు
పిల్లలను బడుల్లో చేర్పించడానికి ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 19 వరకు చేపట్టిన బడిబాట సత్ఫాలితాలనిచ్చింది. ఇప్పటి వరకు బడి ముఖం చూడని వారితో పాటు వివిధ కారణాల వల్ల చదువు మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్చడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
కాగజ్‌నగర్ టౌన్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు చేపట్టిన ఆచార్య జయశం కర్ బడిబాట కార్యక్రమం సక్సెస్ అయింది. గత ఏడాది కంటే మరింత మెరుగైన ప్రవేశాలు ఇంకా కొనసాగుతు న్నాయి. ప్రభుత్వం సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం, దీనికి తోడు ఉపాధ్యాయులంతా చేసిన కృషి ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఆగస్టు వరకు 3,120 ప్రవేశాలు నమోదు అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3,790 మంది విద్యార్థులు చేరారు. రెండు నుంచి పదో తరగతి వరకు గత సంవత్సరం 1,452 విద్యార్థులు చేరగా, ఈ సంవత్సరం 2,106 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇందులో ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు 363 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇంకా ఆగస్టు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగతుందని విద్యా శాఖాధికారులు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలలవైపు మొగ్గు చూపారు. విద్యార్థుల తల్లిదండ్రు లకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలు కమిటీలు, సంఘాలు ఇంటింటికీ తిరిగి చేపట్టిన కృషి వల్ల గతేడాదికి మించిన ప్రవేశాలు నమోదు అయ్యా యని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకటో తరగతిలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెజ్జూరు, వాంకిడిలో అధికంగా ప్రవేశాలు నమోదు కాగా, ప్రైవేటు పాఠశాలల నుంచి ఎక్కువగా వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, కెరమెరిలో, రెండు నుంచి పదోతరగతిలో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కెరమె రి నుంచి అధికంగా ప్రవేశాలు నమోదు అయ్యాయి.
- పెరిగిన ప్రవేశాలు..
ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే గత విద్యా సంవత్సరం కంటే అదనంగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు.ప్రైవేటు పాఠశాలల నుంచి 363 మంది విద్యార్థులు చేరారు. ప్రభుత్వ బడుల్లో చేరితే ఒనగూడె ప్రయోజనాలు, సదుపాయాలు ఉచితంగా అందే సౌక ర్యాలను ప్రచారం బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఫలితంగా అధికంగా ప్రవేశాలు వచ్చినట్లు జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కటకం మఽధుకర్ తెలిపారు. ఇది విద్యాభివృద్ధికి సంకేతమని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు ప్రక్రియ ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలిపారు.
బడుల్లో సౌకర్యాలపై అవగాహన..
సర్కారు బడుల్లో అందుతున్న సౌకర్యాలపై ఉపా ధ్యాయులు, అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఆయా పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా నాణ్య మైన విద్యనందిస్తామని ఉపాధ్యాయులు కరపత్రాలతో పాటు పలు రకాల ప్రచారం చేస్తూ విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షిం చడంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం ఏటా ఒక్కో విద్యార్థిపై రూ. లక్ష ఖర్చు చేస్తూ ఉండడంతో పాటు సకల సదుపాయాలు కల్పించడం, యూనిఫాం అందజేత, పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం, పాఠ్య, రాత పుస్తకాలు అందిస్తున్నామని ప్రచా రం చేశారు. దీంతో పాటు ప్రయివేటు పాఠశాలల్లో అర్హతలు లేని ఉపాధ్యాయు లు ఎక్కు వగా ఉంటారని వివరించడం ప్రభుత్వ పాఠశాలకు మరింత కలిసి వచ్చే అంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు భవి ష్యత్తులో ఉన్నత చదువుల్లో కూడా రిజర్వేషన్ వర్తించ డం వంటి విషయాలను తల్లిదండ్రులకు వివరించారు.
అందరి కృషి ఫలితంగానే..
-కటుకం మధుకర్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి
బడీడు పిల్లలను గుర్తించడానికి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్య కర్తలు, తదితరులు చేసిన కృషి ఫలితంగా ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వం సౌకర్యాలు, సదుపాయాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు వరకు నిరంతరంగా ప్రవేశాలు కొనసాగుతుంటాయి. జిల్లాలో బడిబాట విజయవంతంగా కొనసాగించాం. మూతబడిన పాఠశాలలు తెరిపించేందుకు అధి కారుల సహకారంతో చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jun 23 , 2025 | 11:17 PM