ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలి

ABN, Publish Date - Jun 13 , 2025 | 11:21 PM

జిల్లాలో బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లిలోని స్కూల్‌ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా

కాగజ్‌నగర్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లిలోని స్కూల్‌ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఐదేళ్లు నిండిన పిల్లలను తప్పకుండా బడిలో చేర్పించాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం సమయం కాగానే విద్యార్థులకు నోట్‌ బుక్‌లు, వర్క్‌పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించిన స్వయం సహాయక సంఘాల కృషి ఎంతో అభినందనీయమన్నారు. సమాజంలో ఏదైనా సాఽధించాలంటే విద్యతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ అంశాలపై బోధన జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేం దుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, ఎమ్మెల్యే విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను, యూనిఫాంలు, అడ్మిషన్‌ ఫారాలను అందజేశారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా సైన్స్‌ అధికారి మధూకర్‌, తహసీల్దార్‌ మధూకర్‌, ఎంపీడీవో కోట ప్రసాద్‌, ఎంఈవో వాసాల ప్రభాకర్‌, ఎకౌంట్‌ అధికారి దేవాజీ, ప్రధానోపాధ్యాయులు అనురాధ, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదేనని, విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆదర్శ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి హాజరై సరస్వతిదేవి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ దేశ భవిష్యత్‌ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఉన్నత శిఖరాలకు ఎదిగి గౌరవం పొందడం విద్యతోనే సాధ్యమవుతుంది, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాధి నిర్మించాలని తెలిపారు. తల్లితండ్రులు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. గురుకులాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు డైట్‌ చార్జీలు భారీగా పెంచడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు గల భవనాలు ఉన్నాయని, అన్ని అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,500 మంది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించామని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌, తెలుగు, గణితం, సైన్స్‌ సబ్జెక్టులను బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, ఎంసీఏవో ఉద్దవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయులు, నాయకులు శ్యాంరావు, అరిగెల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:21 PM