MP Garden: హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల గలాటా!
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:52 AM
అది మెహదీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన కమ్యూనిటీ హాల్! దాన్ని కొందరు లీజుకు తీసుకొని ఎంపీ గార్డెన్ పేరుతో ఫంక్షన్ హాల్‌గా నడుపుతున్నారు.
తోపులాటలో కిందపడిన అధికారి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
8ఏళ్లలో రూ.1.5 కోట్ల మేర బకాయిలు
కోర్టు ఉత్తర్వులతో సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులు
కార్వాన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అది మెహదీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన కమ్యూనిటీ హాల్! దాన్ని కొందరు లీజుకు తీసుకొని ఎంపీ గార్డెన్ పేరుతో ఫంక్షన్ హాల్‌గా నడుపుతున్నారు. హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన పన్నులు, ఇతర బకాయిలను వారు ఎనిమిదేళ్లుగా చెల్లించడం లేదు. సుమారు రూ.1.50 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. కోర్టు ఆదేశాలతో ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ అధికారులపై అక్కడి నిర్వాహకులు గొడవకు దిగారు. ఇది తోపులాటకు దారితీయడంతో ఓ అధికారి మృతిచెందారు. ఆసి్‌ఫనగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం హౌసింగ్ బోర్డు అధికారులు, ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు వెళ్లారు. అక్కడ అధికారులతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు.
అధికారులు, నిర్వాహకుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్‌కు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆర్. జగదీశ్వర్‌రావు కింద పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీశ్వర్ మృతిచెందారు. కోర్టు ఉత్తర్వులతో ఫంక్షన్‌హాల్‌ను సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులపై దాడికి పాల్పడి, ఓ అధికారి మృతికి కారణమైన నిర్వాహకులపై ఆసి్‌ఫనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సరైన పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లే తమపై దాడి జరిగిందని హౌసింగ్ బోర్డు అఽధికారులు తెలిపారు. తమను ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేసేందుకు మెహిదీపట్నం ఫంక్షన్ హాల్ యాజమాన్యం దాడికి తెగబడిందని వాపోయారు. కాగా ఉద్రిక్తతల నడుమ ఆ ఫంక్షన్ హాల్‌ను హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. తమ అధికారి మృతికి కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు అధికారులు డిమాండ్ చేశారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 05:52 AM