విద్యార్థులకు బాసటగా..
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:49 AM
పేద విద్యార్థుల ను పీఆర్‌ఆర్ ఫౌండేషన వ్యవస్థాపకుడు చెల్లం పాం డురంగారావు ప్రోత్సహిస్తున్నారు. తమ ఫౌండేషన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారికి స్టడీ మెటీరియల్‌ను అందజేస్తూ వారికి ఆసరాగా ని లుస్తున్నారు.
విద్యార్థులకు బాసటగా..
పేద విద్యార్థులకు ప్రోత్సాహం
స్టడీ మెటీరియల్ అందజేత
అండగా నిలుస్తున్న పీఆర్‌ఆర్ ఫౌండేషన వ్యవస్థాపకుడు పాండురంగారావు
చింతపల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థుల ను పీఆర్‌ఆర్ ఫౌండేషన వ్యవస్థాపకుడు చెల్లం పాం డురంగారావు ప్రోత్సహిస్తున్నారు. తమ ఫౌండేషన ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారికి స్టడీ మెటీరియల్‌ను అందజేస్తూ వారికి ఆసరాగా ని లుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, మౌలిక వసతులు లేక నేలపై కూర్చొని చదువుకుంటున్న విద్యార్థుల ఇబ్బందులను కళ్లారా చూసి వారికి తన వంతుగా చేయూతనందించాలని పూనుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు తనవంతుగా ప్రోత్సహించాలనే తపనతో ఫౌండేషన ఏర్పాటు చేశారు. మర్రిగూడ మండ లం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చెల్లం పాండురంగారావు పదేళ్లుగా గొడకొండ్ల గ్రామపంచాయతీలోని వేంకటేశ్వరనగర్(మాల్)లో నివాసం ఉంటున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు చదివేందుకు వారికి ఆర్థిక ఇబ్బందులు పడుతుండటాన్ని ఆయన నేరుగా చూసి హృదయంచలించిపోయింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 2021లో 600 మందికి స్టడీ మెటీరియల్ తయారు చేయించి ఆయా పాఠశాలలకు వెళ్లి అందించారు. విద్యార్థులకు చాలా సులభంగా అర్థమయ్యేలా, వార్షిక పరీక్షలప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ చదువుకునేలా స్టేట్ రీసోర్స్ పర్సనతో మెటీరియల్ రూపొందించారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా మార్చేందుకు..
నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని 35 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. 2021, 2022, 2023న గణిత, సామాన్యశాస్త్ర మెటీరియల్‌ను తయారు చేస్తున్నారు. ఈ మెటీరియల్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు.
విద్యార్థులకు అందించిన పుస్తకాల వివరాలు ఇలా..
విద్యా స్టడీ ఖర్చు
సంవత్సరం మెటీరియల్ (రూ.లలో)
2021-2022 600 రూ.55,000
2022-2023 1200 రూ. 1,10,000
2023-2024 2200 రూ. 2,20,000
2024-2025 2600 రూ. 2,65,000
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కృషి
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తనవంతు సహకారం అందిస్తున్నా. ఈ సేవ అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో మార్పు ఎంతో అవసరంగా భావించి, వారు జీవితంలో తమ కాళ్లపై నిలబడేందుకు నా వంతుగా కృషి చేస్తున్నా. దాత ల సహకారంతో ప్రతీ సంవత్సరం స్టడీ మెటీరియ ల్ తయారు చేయించి నాలుగు జిల్లాలోని ప్రభు త్వ బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నాం. సమాజంలోని పేద విద్యార్థుల సంక్షేమానికి ఎల్లప్పుడు సహకారం అందిస్తాం.
- చెల్లం పాండురాంగరావు, పీఆర్‌ఆర్ ఫౌండేషన వ్యవస్థాపక చైర్మన, వీటీనగర్
Updated Date - Jul 08 , 2025 | 12:50 AM