ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లో వోల్టేజీ తిప్పలు తప్పేనా?

ABN, Publish Date - May 03 , 2025 | 12:54 AM

అసలే వేసవి కాలం, ముదిరిన ఎండలు, పెరిగిన ఊష్టోగ్ర త, దీనికి తోడు కరెంటు కోతలు అన్నింటికి మించి లోవోల్టేజీ కరెంట్‌తో చండూరు మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లో వోల్టేజీ తిప్పలు తప్పేనా?

చండూరు మండలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

కాలిపోతున్న ఎలకి్ట్రక్‌ వస్తువులు

చండూరురూరల్‌, మే 2(ఆంధ్రజ్యోతి): అసలే వేసవి కాలం, ముదిరిన ఎండలు, పెరిగిన ఊష్టోగ్ర త, దీనికి తోడు కరెంటు కోతలు అన్నింటికి మించి లోవోల్టేజీ కరెంట్‌తో చండూరు మండలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులు గా మండలంలో లో వోల్టేజీ సమస్యతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేసవికాలం కావడంతో పిల్లలకు పాఠశాలలు సెలవులు రావడం, బయట ఎండలు, ఇంట్లో ఉక్కపోతతో నానాతంటాలు పడుతున్నారు. గ్రామాలలో ఎక్కువగా సింగిల్‌ ఫేస్‌ కరెంట్‌, సరైన ట్రాన్సఫార్మర్లు లేక 10 కేవీ, 15 కేవీ 25 కేవీ లైన్లు ఉండటంతో సింగిల్‌ ఫేస్‌ లైన్లతో నడిపిస్తున్నారు. దీంతో గ్రామాలలో ఒక్కో 10 కేవీ బుడ్డి మీద 50 నుంచి 80 సర్వీసులు ఇవ్వడంతో లో వోల్టేజీ సమస్య ఏర్పడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రం మునిసిపాలిటీలో ఈ లో వోల్టేజీ సమస్య తీవ్రస్థాయిలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో 63 కేవీ, 100 కేవీ లైన్లు ఉన్నా వాటి మీద అధిక సర్వీసులు ఇవ్వడంతో ఈ లోవోల్టేజీ సమస్య అధికమవుతుంది. మునిసిపల్‌ పరిధిలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో 100 కేవీ లైన మీద 500 సర్వీసుల వరకు కనెక్షన్లు ఇవ్వడంతో ఈ సమస్య పెరిగింది. మరీ ముఖ్యంగా బిజీగా ఉండే వ్యాపార సముదాయం ఏరియాలో 150 కేవీ లైన మీద 600 నుంచి 700 సర్వీసుల కనెక్షన్లు ఇవ్వడంతో సమస్య తీవ్రతరంగా మారింది. ఒక 100 కేవీ లైన మీద 120 నుంచి 200 వరకు సర్వీసులు ఉంటే నాణ్యమైన విద్యుత సరఫరా జరుగుతుంది. కానీ అధికంగా విచ్చలవిడిగా కనెక్షన్లు ఇవ్వడంతో ఈ లోవోల్టేజీ సమస్య మరింత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉచిత విద్యుత కూడా ఓ కారణమే...

ఈ లోవోల్టేజీ సమస్యకు ఉచిత విద్యుత కూడా ఒక కారణంగా మారింది. ముఖ్యంగా కరెంట్‌ వాడ కం పెరిగింది. సామాన్య మానవుడి ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతీది కరెంట్‌ మీద ఆధారపడి జీవిస్తున్నారు. క్షణం ఫ్యాన లేనిదే ఉండలేకపోతున్నారు. 24 గంటలు టీవీ, ఫ్యాన్లు నడుస్తూనే ఉన్నాయి. ప్రతీ ఇంట్లో కూలర్‌, నీళ్లకు మోటార్‌ ప్రతీది కరెంట్‌ మీద ఆధారపడటంతో విద్యు త వినియోగం కూడా పెరిగింది. దీంతో ఈ లోవోల్టేజీ సమస్య తీవ్రంగా మారింది. ఉచిత విద్యుత కారణంగా పట్టణాల్లో విలాసాలకు అలవాటు పడిపోయారు. ప్రతీ 10 ఇళ్లల్లో ఒకరు ఏసీ వాడుతున్నారు. వాషింగ్‌ మిషన్లు, కుక్కర్లు, మిక్సీ, గ్రైండర్‌ వంటి విలాసాలతో విద్యుత వినియోగం విపరీతం గా పెరిగింది. ఏది ఏమైనా వేసవి కాలంలో కరెంటు కోతలతో, లోవోల్టేజీ సమస్యతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ లోవోల్టేజీ సమస్య లేకుండా, విద్యుత కోతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కాలిపోతున్న ఎలకి్ట్రక్‌ వస్తువులు

లో వోల్టేజీ సమస్యతో ఇళ్లల్లోని విద్యుత పరికరాలు, ఎలకి్ట్రక్‌ వస్తువులు కాలిపోతున్నాయి. ముఖ్యంగా ఈ లోవోల్టేజీ సమస్యతో ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా కాలిపోతున్నాయి. అంతే కాకుండా కరెంట్‌ కోతలతో కరెంట్‌ వచ్చిపోయిన ప్రతిసారీ లోవోల్టేజీ నుంచి ఒకే సారి హైవోల్టేజీ రావడంతో ఈ సమస్య తీవ్రంగా ఉంది.

కరెంటు కోత విధిస్తున్నారు.

చండూరు మునిసిపాలిటీలో కరెంట్‌ కోతలు అధికంగా ఉన్నాయి. దానికి తోడు లోవోల్టేజీ కరెంటు రావడంతో ఫ్యాను, కూలర్లు తిరగడానికి మొరాయిస్తున్నాయి. రాత్రి సమయంలో ఫ్యాన, కూలర్‌ ఫుల్‌ స్పీడ్‌గా పెట్టినా తిరగలేక తిరగలేక తిరుగుతున్నాయి. వాటికంటే విసనకర్రలు మేలు. ఫ్యాన్లు తిరగక దోమలతో రాత్రిళ్లు యుద్ధం చేయాల్సి వస్తుంది. దయచేసి అధికారలు స్పందించి కరెంట్‌ లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన కరెంట్‌ అందించాలి.

-భీమనపల్లి ముత్యం, చండూరు

లోవోల్టేజీ కరెంట్‌తో ఇబ్బందులు

కరెంట్‌తో లోవోల్టేజీ సమస్యతో గ్రామంలో ఇబ్బందులు పడుతు న్నాం. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికి తోడు కరెంట్‌ కోతలు కూడా ఎక్కువయ్యాయి. అంతే కాకుండా సింగిల్‌ ఫేస్‌ కరెంట్‌ రావడంతో ఫ్యాన్లు, కూలర్లు కాలిపోతున్నాయి. సింగిల్‌ ఫేస్‌ విద్యుత సరఫరా మార్చి త్రీఫేస్‌ కరెంట్‌ ఇవ్వాలి.

- కాశమల్ల అనిల్‌కుమార్‌, తుమ్మలపల్లి

సమస్య పరిష్కారానికి కృషి

చండూరు మండలంలో ఎక్కువగా సమస్యలు లేవు. ఇప్పటి నా దృష్టికి రాలేదు. ఒక వేళ ఫిర్యాద లు వస్తే వెంటనే పరిష్కరిస్తాం. చండూరు మునిసిపాలిటీలో కొన్ని ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య ఉంది. మండలానికి కొన్ని 100కేవీలైన్లు మం జూరయ్యాయి. వాటిని అతి త్వరలో ఏర్పాటు చేసి మండలంలో ఈలోవోల్టేజీ సమస్య తలెత్తకుండా చూసుకుంటాం.

- ప్రవీణ్‌రెడ్డి, ఇనచార్జి ఏఈ, చండూరు

Updated Date - May 03 , 2025 | 12:54 AM