kumaram bheem asifabad- అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
ABN, Publish Date - Jul 15 , 2025 | 10:52 PM
vవాంకిడి మండలం జైత్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పిల్లలకు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంగళవారం డీడీ భాస్కర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో సరఫరా చేసిన గుడ్లను, ఇతర పౌష్టికాహార సరుకులను పరిశీలించారు.
వాంకిడి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలం జైత్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పిల్లలకు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంగళవారం డీడీ భాస్కర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో సరఫరా చేసిన గుడ్లను, ఇతర పౌష్టికాహార సరుకులను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో సరఫరా చేసిన గుడ్లు, కుళ్లిన వాసన వస్తున్నట్లు స్థానికులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. అన్ని కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
మహిళల హక్కులను పరిరక్షించాలి
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 15(ఆంధ్రజ్యోతి): మహిళల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, నిరోధానికి 2013లో ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో, ఇంటర్నల్ కంప్లెట్స్ కమిటీ ఏర్పాటును చేసే మహిళల ఆత్మగౌరవం కాపాడే విధంగా చట్టాన్ని రూపొందించిందని చెప్పారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం సిబ్బందితో జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. షీ బాక్స్ గవర్నమెట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో అన్ని సంస్థల వారు కమిటీ సభ్యులను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని సంస్థల వారు సహకరించాలని కోరారు. ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Updated Date - Jul 15 , 2025 | 10:52 PM