ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Koonanneni: వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేయాలి

ABN, Publish Date - Jun 25 , 2025 | 04:49 AM

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పలు సిఫారసులు చేస్తూ నీలం రాజశేఖర్‌ రెడ్డి పరిశోధనా కేంద్రం (చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌) ఓ నివేదిక రూపొందించింది.

  • వ్యవసాయ రంగం అభివృద్ధికి సిఫారసులతో నీలం రాజశేఖర్‌ రెడ్డి పరిశోధనా కేంద్రం నివేదిక

  • మంత్రి తుమ్మలకు అందజేసిన కూనంనేని

హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పలు సిఫారసులు చేస్తూ నీలం రాజశేఖర్‌ రెడ్డి పరిశోధనా కేంద్రం (చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌) ఓ నివేదిక రూపొందించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ సురే్‌షబాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆ నివేదికను అందజేశారు. నేల స్వభావాన్ని బట్టి ప్రభుత్వం సమగ్రమైన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని, మూలవంగడాలను వినియోగించి కొత్తవాటి పరిశోధనలకు పెద్దపీట వేయాలని, విత్తన రంగంలో స్వయం సమృద్ధి కోసం కొత్త విత్తన చట్టం తేవాలని సూచించారు. రిజర్వ్‌ బ్యాంకు సూచించినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 40 శాతం వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని, వాటిలో 70 శాతం చిన్న, సన్నకారు రైతులకు అందించేలా కఠిన నిబంధనలు రూపొందించాలని కోరారు.ప్రభుత్వ రంగ బీమా సంస్థల ద్వారానే బీమా సౌకర్యం కల్పించాలని, చిన్న రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు. ఈ సిఫారసులను పరిశీలనలోకి తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు.

Updated Date - Jun 25 , 2025 | 04:49 AM