ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన్‌ కార్డులు ఇచ్చేదెప్పుడు?

ABN, Publish Date - May 12 , 2025 | 11:33 PM

కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త కార్డులను జారీ చేయడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు.

- సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి ఉత్తమ్‌

- ఆరు నెలలు గడుస్తున్నా అర్హులకు అందని కార్డులు

- జిల్లాలో 15వేల పై చిలుకు దరఖాస్తులు

- కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు దూరం

మంచిర్యాల, మే 12 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త కార్డులను జారీ చేయడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదు. దీంతో కుటుంబాలు వేరుపడిన వారితో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు రేషన్‌ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నా రు. రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డు లింక్‌ ఉండటంతో ఆశావహులు వీటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... అర్హులైన వారికి రేషన్‌ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, సంక్రాంతి పండుగ నుంచి రేషన్‌ కార్డుల మంజూరు మొదలవుతుందని ప్రకటించారు. కొత్తరేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్‌ ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.

రేషన్‌ కార్డుల జారీకి కాంగ్రెస్‌ హామీ...

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలుత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018 వరకు రేషన్‌ కార్డులను జారీ చేసింది. 2018 డిసెంబరులో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. ఆ తర్వాత అనేకమంది దరఖాస్తులు చేసుకోగా, వాటిని 2022 సంవత్సరంలో పరిశీలించి, అందులో అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేశారు. ఆ తరువాత వెబ్‌సైట్‌ను మూసివేసిన ప్రభుత్వం మళ్లీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. 2023 నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్‌ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది. అనుకున్న విధంగానే రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కొత్తరేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రకటించారు. మొదట 2023 డిసెంబరు 9వ తేదీ నుంచి ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, చేయూత పథకంతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు పథకాలను అమలు చేసేందుకు 2023 డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, వార్డుసభల్లో ఐదు గ్యారంటీ పథకాలు వర్తింపజేసేందుకు స్వీకరించిన దరఖాస్తులతో పాటు, కొత్తరేషన్‌ కార్డుల కోసం కూడా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే వంట గ్యాస్‌ సిలిండర్‌ పథకం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల స్థలంతో పాటు ఇళ్లు మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, చేయూత కింద కొత్తగా పింఛన్‌ మంజూరు కోసం ప్రజాపాలన దరఖాస్తు ఫారాన్ని రూపొందించారు. కోరిన విధంగా దరఖాస్తులను పూరించిన ఆశావహులు వాటిని అధికారులకు అందజేశారు. వీటితోపాటు రేషన్‌కార్డులు లేనివారు తెల్ల రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రజల నుంచి రేషన్‌ కార్డుల కోసం దరఖా స్తులు స్వీకరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం అర్హుల జాబితా తయారు చేసి, విడుదల చేసిందే తప్పా...కార్డులు ఇవ్వడంలో జాప్యం చేస్తోంది.

- దరఖాస్తులకు కలగని మోక్షం...

జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 15వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాలు, నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం అర్హులైన వారికి రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి, దరఖా స్తులు స్వీకరించింది. రేషన్‌ కార్డులు లేక రూ.500కే సబ్సిడీ వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం పొందలేకపోతు న్నారు. రేషన్‌కార్డు ఆధారంగా రూ. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయగా, కార్డులు లేని వారికి రుణమాఫీ కాలేదు. అదే రేషన్‌ కార్డు ఉంటే అందరితో పాటు తమకు కూడా రుణమాఫీ అయ్యేదనే అభిప్రా యాలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఇప్పటికైనా కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని జాబితాల్లో పేర్లున్న లబ్దిదారులు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2025 | 11:33 PM