గంజాయి రహిత సమాజం కోసం కృషిచేయాలి
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:55 PM
గంజాయి, మత్తుపదార్థాల రహిత సమాజంకోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని మంచిర్యాల డీసీపీభాస్కర్ సూచించారు. సోమవారం యాంటీడ్రగ్ అవెర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా మందమర్రిలోని కేజీబీవీ పాఠశాల, మోడల్ స్కూల్‌లో మత్తు పదార్ధాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
- మంచిర్యాల డీసీపీ భాస్కర్
మందమర్రిరూరల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): గంజాయి, మత్తుపదార్థాల రహిత సమాజంకోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని మంచిర్యాల డీసీపీభాస్కర్ సూచించారు. సోమవారం యాంటీడ్రగ్ అవెర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా మందమర్రిలోని కేజీబీవీ పాఠశాల, మోడల్ స్కూల్‌లో మత్తు పదార్ధాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లోరాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుంద న్నారు. మత్తు పదార్థాల నివారణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, ప్రజలందరు పోలీసులకు సహకరించాల న్నారు. అనంతరం పాఠశాలల్లో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, కేజీబీవీ ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్లీమ్, ఎస్‌ఐ రాజశేఖర్, అదనపు ఎస్‌ఐ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.
వేమనపల్లి : విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జైపూర్‌ఏసీపీ వెంకటేశ్వర్లు సూచిం చారు. సోమవారం నీల్వాయిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశా లలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పాఠశాలఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీల్వాయిఎస్‌ఐ శ్యామ్‌పటేల్, ప్రధా నోపాధ్యాయుడు గిరిధర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లేష్, విద్యార్ధులు పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:55 PM