ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటుపడాలి

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:29 AM

మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

- ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ సూచించారు. సోమవారం కాగజ్‌నగర్‌ మండలంలోని బురదగూడ గ్రామంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణ, వాటి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాదక ద్రవ్యాల వలన కలిగే చెడు పరిణామాలను గుర్తించాలని, గంజాయి, డ్రగ్స్‌ బారిన పడి యువత జీవితాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డిఎస్పీ రామానుజం, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై సందీప్‌, గ్రామస్థులు, పోలీసులు పాల్గొన్నారు.

విలేజ్‌ ఆఫీసర్‌ కార్యక్రమం ప్రారంభం..

బురదగూడ గ్రామంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ గ్రామ పోలీస్‌ అధికారి వ్యవస్థను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతీ గ్రామానికి ఒక పోలీసును నియమించి గ్రామం యొక్క పూర్తి బాధ్యత వహిస్తాడన్నారు. గ్రామపోలీసు అధికారి గ్రామస్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడన్నారు.

మాదకద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి

పెంచికలపేట: మాదకద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని యువత వాటికి దూరంగా ఉండాలని కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో పోలీసు మిత్ర కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం న్విహించారు. కార్యక్రమంలో ఎస్సై అనిల్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఏఎస్సై ప్రభాకర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కెరమెరి: మండలంలోని గోయగాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రకాష్‌, ఉపాధ్యాయులు రమేష్‌, విష్ణుగౌడ్‌ పాల్గొన్నారు.

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

ఆసిఫాబాద్‌ (ఆంధ్రజ్యోతి): బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదా రుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.

Updated Date - Jul 08 , 2025 | 12:29 AM