ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:31 PM

బాధితులకు సత్వర న్యా యం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బాధితులకు సత్వర న్యా యం జరిగేలా చూడాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులనుంచి అర్జీలు స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను పోన్‌లో ఆదేశించారు. ప్రజాఫిర్యాదు లను నేరుగా స్వీకరిస్తూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అధికారులకు సూచించారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌ టౌన్‌ సీఐ బాలాజీ వరప్రసాద్‌, రెబ్బెన సీఐ సంజీవ్‌ ఎస్పీని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సోమవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ వారిని అభినందించి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. సమాజంలో పోలీసులపై నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. కమ్యూనిటి పోలీసింగ్‌, రోడ్డు భద్రత, మహిళా భద్రత, యువతలో మాదకద్రవ్యాలపై అవగహన కల్పించే కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Updated Date - Aug 04 , 2025 | 11:31 PM