ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సరిపడా యూరియా ఉంది.. ఆందోళన వద్దు

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:31 PM

జిల్లాలో సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. రైతు లు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు.

నెన్నెలలో ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి, భీమిని ఏడీఏ

- జిల్లా వ్యవసాయ అధికారి కల్పన

నెన్నెల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. రైతు లు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపులు, గోదాములను బుధవారం ఆమె ఆకస్మి కంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా రైతాంగం ప్రస్తుతం విత్తనాలు వేసుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు పంట లకు యూరియా అవసరం లేదన్నారు. దారులులేని రైతులు చేలల్లో నిల్వ చేసుకునేందుకు యూరియా కోసం ఎగబడుతుండటంతో పంపిణీలో గందరగోళం నెలకొంటుందన్నారు. ఇండెంట్‌ ప్రకారం అన్ని మండలాలకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏడు వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేశామని, మరో ఐదు వేల మెట్రిక్‌ టన్నులు త్వరలో వస్తుందన్నారు. సహకార సంఘాలతో పాటు, ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంద న్నారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఆమెవెంట భీమిని ఏడీఏ సురేఖ, ఏవో పుప్పాల సృజన ఉన్నారు.

- ఈ-పాస్‌ ద్వారానే పంపిణీ చేయాలి

ఎరువులను ఈ-పాస్‌ ద్వారానే పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. నెన్నెల రైతువేదికలో డీలర్లకు ఈ-పాస్‌ యంత్రా లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకునేందుకు పాత వాటి స్థానంలో కొత్త మెషిన్లు అందజేస్తున్నామన్నారు. రైతుల ఆధార్‌ నంబరుతో పాటు, కొను గోలు చేసిన ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు యంత్రంలో నమోదు చేయాలని సూచించారు. నూతన విధానం ద్వారా ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని, ఎరువులు పక్కదోవ పట్టే అవకాశం లేదన్నారు. రైతులకు ప్రభుత్వ ఆమోదిత విత్తనాలను అమ్మి.. విధిగా పూర్తి వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని సూచించారు. దుకాణం ఎదుట ధరలు, ఎరవుల స్టాక్‌ వివరాలను తెలిపే బోర్డులను తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. భీమిని ఏడీఏ సురేఖ, టెక్నికల్‌ ఏవో శ్రీనివాస్‌, నెన్నెల, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల వ్యవసాయ అధికారులు సృజన, వీరన్న, ప్రశాంత్‌, యుమునా, డివిజన్‌లోని డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 11:31 PM