ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:46 PM

నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌

- ఎమ్మెల్సీ దండె విఠల్‌

కాగజ్‌నగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ తెలిపారు. శనివారం కాగజ్‌నగర్‌ మండలంలో పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

దహెగాం: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు వరం అని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. శనివారం దహెగాం మండలంలోని కోత్మీర్‌, రాళ్లగూడ, ఇట్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇళ్లులేని నిరుపేదలు దళారులను నమ్మి మోస పోవద్దని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సురేష్‌ జయలక్ష్మి, టి.శ్రీరామరావు, గంగమ్మ బ్రాహ్మయ్య, శ్రీనివాస్‌, రమేష్‌, ఎంపీడీఓ ఆల్బర్ట్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:46 PM