ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగని నకిలీ పత్తివిత్తనాల దందా

ABN, Publish Date - May 26 , 2025 | 11:27 PM

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా ఆగటం లేదు. వ్యవసాయా శాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా దాడులు చేస్తున్న కూడా దందా సాగుతోంది. రెండ్రోజుల క్రితం రూ.60లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

కాగజ్‌నగర్‌లో పట్టుకున్న నకిలీ విత్తనాలను చూపుతున్న ఎస్పీ శ్రీనివాస్‌రావు (ఫైల్‌)

- దాడులు చేస్తున్నా వివిధ మార్గాల ద్వారా తరలింపు

- రైతులకు ఎరవేస్తున్న దళారులు

- నేరుగా గ్రామాల్లోకి డంపింగ్‌ చేస్తున్న నిర్వహకులు

- కర్ణాటక, ఖమ్మం, విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న దందా

కాగజ్‌నగర్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా ఆగటం లేదు. వ్యవసాయా శాఖ, పోలీసుశాఖ సంయుక్తంగా దాడులు చేస్తున్న కూడా దందా సాగుతోంది. రెండ్రోజుల క్రితం రూ.60లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇంత భారీస్థాయిలో ఈ దందా కొనసాగుతుందంటే ఏ మేరకు వీరి వ్యాపారం సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వం ఈ దందాపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ నిర్వహకులు ట్రాన్స్‌పోర్ట్స్‌, రైళ్లు, జాతీయ రహదారి గుండా యఽథేచ్ఛగా తరలిస్తున్నారు. కర్ణాటక, ఖమ్మం, విజయవాడ కేంద్రంగా ఈ దందాను కొంత మంది దళారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల రైతులకు చేరవేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పత్తి విత్తనాలు, ఎరువుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే పత్తి విత్తనాల ఫ్యాక్టరీలో వివిధ కారణాలతో సరిగాలేని విత్తనాలను పక్కన పెట్టేసిన వాటిని కొంత మంది దళారులు బియ్యం సంచుల్లో తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. పేరొందిన కంపెనీలకు దీటుగా నకిలీ అమ్మకాలు చేసి లక్షల రూపాయల్లో లాభాలు గడిస్తున్నారు. సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో అధికంగా పత్తి పంటను వేయటంతో అమాయక రైతులకు అంటగట్టేందుకు వర్షాకాలం ముందుగానే గ్రామాల్లో చేరవేసేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. పేరొందిన బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన 100 గ్రాముల ప్యాకెట్‌కు 500 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఖమ్మం, విజయవాడ నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి కొంతమంది బ్రోకర్లు ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు కూడా కిలో చొప్పున ప్యాకెట్టు తయారు చేసి 3000 రూపాయలకు అమ్ముతున్నారు. కౌరుచౌకగా గ్రామాల్లోనే లభ్యమవుతుండటంతో వీటినే రైతులు గుట్టుచప్పుడు కాకుండా దళారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఈ విత్తనాలు వాడితే గడ్డిరాదని ప్రచారం చేస్తున్నారు. దీంతో అమాయక రైతులు ఈ విత్తనాలను ఎడాపెడా కొనేస్తున్నారు. కాగా పోలీసు శాఖ, వ్యవసాయా శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టులు నిర్వహిస్తున్న వివిధ దుకాణాలపై కూడా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తేఊరుకునేది లేదని హెచ్చరించారు. సీడ్స్‌ డీలర్లతో కూడా సమావేశం నిర్వహించి అధికారులు అందరిని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నకిలీ పత్తివిత్తనాలపై కఠిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండు చేస్తున్నారు.

ఇటీవల పట్టుబడిన సంఘటనలు..

- కుమురం భీం జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఏప్రిల్‌ 4న చింతమానేపల్లిలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నకిలీ పత్తివిత్తనాలున్నట్టు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించగా 300 కిలోల నకిలి పత్తి విత్తనాలు లభించాయి. ఈ దందాను కొనసాగిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన లోకండే భిక్షపతి, గుంటూరుకు చెందిన సురేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.

- కాగజ్‌నగర్‌ పట్టణంలో మూడు రోజుల క్రితం నవత ట్రాన్స్‌పోర్టుపై టాస్క్‌ఫోర్సు అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 45 కిలోల నకిలీ బిటీ విత్తనాలు లభ్యం కావటంతో వీటిని తెచ్చిన కుశ్నపల్లి నివాసి చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. వీటి విలువ రూ.1.57లక్షలున్నట్టు తేల్చారు. ఈ సంఘటనతో పోలీసులు, వ్యవసాయాధికారులు జిల్లాలో అన్నీ ట్రాన్స్‌పోర్టర్లపై దాడులు నిర్వహించారు.

- మూడు రోజుల క్రితం పెద్దవాగు నుంచి కాగజ్‌నగర్‌కు వస్తున్న ఏపీ38టీవై9741 నండర్‌ గల వాహనాన్ని తనిఖీ చేసి 20 క్వింటాళ్ల బీటీ3 రకం నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.60లక్షల మేర ఉంటుంది. ఈ కేసులో కాగజ్‌నగర్‌ కాపువాడలో నివాసం ఉండే కొత్తపల్లి సదాశివ్‌ అనే వ్యక్తితో పాటు లక్ష్మణ్‌, సంతోష్‌ కిషోర్‌, వేణుగోపాల్‌రెడ్డిపై కేసులు కూడా నమోదు చేసినట్టు ఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు.

తరుచుగా పట్టుబడితే పీడీ యాక్టు

- డీఎస్పీ రామానుజం

సిర్పూర్‌(టి)(ఆంధ్రజ్యోతి): నిషేధిత వస్తువులు రవాణా చేస్తూ తరుచుగా పట్టుబడితే వారిపై పీడీ యాక్టు కేసు నమోదు చేస్తామని కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజం అన్నారు. ఆదివారం మండలంలోని భూపాలపట్నం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వారు తెలిపిన వివరాలను సోమవారం సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వివారలను డీఎస్పీ వెల్లడించారు. సిర్పూర్‌(టి) మండలం భూపాలపట్నం గ్రామంలో 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అదే గ్రామానికి చెందిన బోయినపల్లి అశోక్‌ ఇంట్లో దొరికినట్లు తెలిపారు. అశోక్‌ను అదుపులోకి తీసుకు విచారించగా 20 రోజుల క్రితం బెజ్జూరు మండలం సుస్మీర్‌కు చెందిన తలండి సురేష్‌, ఎడ్మ ప్రశాంత్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోరంట్ల సురేష్‌ అనే వ్యక్తి వద్ద మూడు క్వింటాళ్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేశారన్నారు. అందులో నుంచి రైతులకు ఇప్పటి వరకు రెండు క్వింటాళ్ల విత్తనాలు అమ్మారని, మిగిలిన విత్తనాలను భూపాలపట్నం ఉంచినట్లు తెలిపారు. ఈ మేరకు సిర్పూర్‌(టి) ఎస్సై కమలాకర్‌ విత్తనాలను పట్టుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఎస్సైతో పాటు పోలీసు సిబ్బందిని అభినందించారు. సమావేశంలో సీఐ రమేష్‌, ఎస్సై కమలాకర్‌, ఏఓ గిరీష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:27 PM