పేరుకే రెవెన్యూ డివిజన్...
ABN, Publish Date - May 16 , 2025 | 11:44 PM
బెల్లంపల్లి రెవె న్యూ డివిజన్, మండలాలు ఏర్పాటైన సొంత భవనాలు లేకపోవడంతో అసౌకర్యాల నడుమ పాలన కొనసా గుతోంది. నియోజకవర్గకేంద్రమైన బెల్లంపల్లిలో రెవె న్యూ డివిజన్ కావడంతో ఆర్డీవో కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయి కార్యాలయాలు అందుబాటులోకి వ చ్చాయి. అలాగే నియోజకవర్గంలో నూతనంగా కన్నె పల్లి మండలం సైతం ఏర్పాటు కావడంతో తహసీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ మండల శాఖ కార్యాల యాలు సైతం అందుబాటులోకి వచ్చాయి.
ఫ డివిజన్, మండలాల ఏర్పాటుతో సరి
ఫ శిథిలావస్థలో, అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు
ఫ భవన నిర్మాణాలు చేపట్టని వైనం...ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజలు
బెల్లంపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి రెవె న్యూ డివిజన్, మండలాలు ఏర్పాటైన సొంత భవనాలు లేకపోవడంతో అసౌకర్యాల నడుమ పాలన కొనసా గుతోంది. నియోజకవర్గకేంద్రమైన బెల్లంపల్లిలో రెవె న్యూ డివిజన్ కావడంతో ఆర్డీవో కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయి కార్యాలయాలు అందుబాటులోకి వ చ్చాయి. అలాగే నియోజకవర్గంలో నూతనంగా కన్నె పల్లి మండలం సైతం ఏర్పాటు కావడంతో తహసీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ మండల శాఖ కార్యాల యాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రజా అవ సరాలను తీర్చే ప్రభుత్వ అధికారులు కొలువై ఉండే ప్ర భుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో, శిథిలావస్థలో ఉ న్న భవనాల్లో అధ్వాన పరిస్థితుల నడుమ కొనసాగు తున్నాయి. ఏండ్లు గడుస్తున్నా సొంత భవనాలు లేకపో వడంతో ప్రజలతో పాటు అధికారులు ఇబ్బందులు ప డుతున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవన నిర్మా ణాలు చేపట్టకపోవడంతో ప్రజాప్రతినిధులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ పేరుకే రెవెన్యూ డివిజన్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వి భజన చేపట్టి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే క్రమంలో బెల్లంపల్లిని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యాక ఆ ర్డీవో, ఏసీపీ, డీఎల్‌పీవో, ఏడీఏ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అలాగే బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లో కన్నెపల్లి మండలం సైతం నూతనంగా ఏర్పడింది. తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్, వ్యవసాయ కా ర్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదంతా బా గానే ఉన్నా ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవ నాలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సింగరేణి క్వార్టర్లలో బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం, ఏ సీపీ కార్యాలయం, ఏడీఏ కార్యాలయం, సింగరేణి స్కూ ల్ భవనంలో తహసీల్దార్ కార్యాలయం, ట్రెజరీ కార్యా లయం, ఎక్సైజ్ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. అలాగే కన్నెపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాల యం ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. తహసీల్దార్ కార్యాలయం పాఠశాల భవనంలో కొనసాగుతుంది. శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో పోలీస్‌స్టేన్ కొన సాగుతుంది. ప్రజల సమస్యలు పూర్తిస్ధాయిలో పరి ష్కారం కావాలంటే పూర్తిస్ధాయిలో ఉద్యోగులతో పాటు అవసరమైన భవనలు, వసతులు కలిగి ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా రెవెన్యూ డివిజన్‌లో శిథిలావస్థలో ఉన్న, అద్దెభవనాల్లో కార్యాలయాలు కొన సాగు తున్నాయి.
ఫ సమస్యల వలయంలో కార్యాలయాలు
నూతనంగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్‌లో తహసీ ల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉంది. వర్షాకాలంలో స్లాబ్ పెచ్చులూడి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏడీఏ కార్యాలయం విషసర్పాలకు నిలయంగా మారుతుంది. శిథిలావస్థలో ఉన్న ఈ భవనంలో ఎప్పు డు పాములు సంచరిస్తూ ఉంటుండంతో వ్యవసా యాశాఖ అధికారులు భయం భయంగా విధులు నిర్వ హిస్తున్నారు. ఈ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు సైతం కనీసం కూర్చోవడానికి గదులు లేకపోవడం, అత్యవసర సమయంలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవ డంతో ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు వెళ్లిన సమయంలో కార్యాలయాల ఆవరణలో ఉన్న చెట్ల కిం ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ఫ ప్రభుత్వ స్థలాలున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు
బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడి ఏండ్లు గ డుస్తునప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించలేదు. బెల్లంపల్లిలో వందల ఎకరాల్లో ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ శాశ్వత భవనాల నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు కృషి చేయడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి సొంత భవనా లకు నిధులు మంజూరు చేసి నిర్మాణాలను చేపట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 16 , 2025 | 11:45 PM