జీవో 49 తాత్కాలిక రద్దు కంటి తుడుపు చర్య
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:44 PM
రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని తాత్కాలికంగా రద్దు చేయటం కేవలం కంటి తుడుపు చర్య అని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
- సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
కాగజ్‌నగర్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని తాత్కాలికంగా రద్దు చేయటం కేవలం కంటి తుడుపు చర్య అని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ సంఘాలు, బీజేపీ, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏజేన్సీ ప్రాంతాల బంద్ సంపూర్ణ కావటంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని పేర్కొన్నారు. జీవో తాత్కాలిక రద్దు కేవలం ఉద్యమాన్ని శాంతింపజేసేట్టు చేసేందే అన్నారు. జీవో శాశ్వతంగా రద్దు అయ్యేంత వరకు పోరాటాలు విరమించేదిలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తేనే జీవో తెచ్చామని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలికారని, ఇప్పుడు తాత్కాలిక నిలుపుదల ఆర్డర్స్ ఇవ్వటానికి కేంద్రాన్ని సంప్రదించారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రమేయం లేని అంశంలో బీజేపీని టార్గెట్ చేయడం మానుకోవాలని హితవుపలికారు. ఈ నెలాఖరు వరకు జీవో రద్దుచేయని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో నిరవధిక దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయా, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్ రావు, సిందం శ్రీనివాస్, బాల్క శ్యాం, మాజీ ఎంపీపీ మనోహర్‌గౌడ్, చిప్పకుర్చి శ్రీనివాస్, కొండ తిరుపతి, సాంబయ్య, గణపతి, లింగమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 11:44 PM