ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - May 06 , 2025 | 11:22 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో యాదయ్య సూచించారు.

జైపూర్‌లోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

జైపూర్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో యాదయ్య సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తున్న జిల్లాపరిషత్‌ ప్రభుత్వ పాఠశాల, ప్రైమరీ పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులు క్యాంపులో ఏం నేర్చుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు మ్యాథ్స్‌, తెలుగు అక్షరాలను రాయడం, చదవడం నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని గ్రామ కార్యదర్శి ఉదయ్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

తాండూర్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం ఎంఈవో మల్లేశం సమ్మర్‌ క్యాంపులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జూన్‌ 5 వరకు పాఠశాలల్లో సమ్మర్‌క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో పిల్లల అబ్యాసన అభివృద్ధి, గణితంలో మౌలిక సామర్ధ్యాలు మొదలగు వాటిలో మెలకువలు, చిత్రలేఖనం నేర్పిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు క్యాంపులు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలను తప్పనిసరిగా క్యాంపులకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దండేపల్లి (ఆంధ్రజ్యోతి): మండలంలోని నెల్కివెంకటాపూర్‌ ఎంపీపీఎస్‌ ప్రభుత్వ పాఠశాలోని సమ్మర్‌ క్యాంప్‌ను ఎంఈవో చిన్నయ్య ప్రారంభించారు. తాళ్లపేట ఎంపీపీఎస్‌ పాఠశాలోని సమ్మర్‌ క్యాంప్‌ను పాఠశాల హెచ్‌ఎం జగదీశ్వర్‌గౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అజ్మీర శివనాయక్‌, ఉపాధ్యాయులు ప్రభాకర్‌, రామరాజు, శ్రీనివాస్‌, విద్యార్ధులు పాల్గొన్నారు.

క్రీడలతో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం

మందమర్రిటౌన్‌ (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, క్రమ శిక్షణ కలుగుతుందని మందమర్రి జీఎం దేవేందర్‌ తెలిపారు. మంగళవారం స్ధానిక సింగరేణి పాఠశాలమైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభించి మాట్లాడారు. మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణపూర్‌, సోమగూడెంలకు చెందిన పిల్లలకు వాలీబాల్‌, అధ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ కోచ్‌లతో శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం పిల్లలకు క్రీడా సామాగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం విజయ్‌ప్రసాద్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం అద్యక్షుడు రమేష్‌, పీఎం శ్యాంసుందర్‌, క్రీడల గౌరవ కార్యదర్శి మాస్కుల కార్తీక్‌, సమన్వయకర్త శివకృష్ణ, గ్రౌండ్‌ఇన్‌చార్జీ నస్పూరి తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:24 PM