మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం భారీ వర్షం
ABN, Publish Date - Jun 14 , 2025 | 11:23 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో శనివారం భారీ వర్షం కురిసింది.
ఆసిఫాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యో తి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో శనివారం భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్, వాంకిడి మండలాల్లో మ ధ్యాహ్నం వరకు వాతావరణం ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా సా యంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘా వృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. విద్యుత్ సరఫరాలో అం తరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ పట్టణం, మండలంలో శనివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు తోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది. సుమారు గంట పాటు భారీ వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
Updated Date - Jun 14 , 2025 | 11:24 PM