ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:32 PM

ప్రభుత్వ పాఠ శాలల్లోని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. బుధవారం చెన్నూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించారు.

కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలల్లోని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. బుధవారం చెన్నూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలోని వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగా యలు, నాణ్య మైన నిత్యావసర సరుకులను వినియోగించాలన్నారు. శుద్ధమైన తాగునీటిని విద్యార్థులకు అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల పఠన సామర్ధ్యాలను పరిశీ లీంచారు. పాఠశాల, కేజీబీవీలో కిటీకీలు, తలుపులు, మూత్రశాలలు, ఫ్యాన్‌లు, లైట్లు ఇతర పాడైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతి పాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, ఎంపీడీవో మోహ న్‌ను ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కస్తూర్బాదాంధీ బాలికల విద్యాయలంలో పాడైన ఆర్‌వో ప్లాంట్‌ను మరమ్మతులు చేసి శుద్దమైన నీటిని అందించాలని, పాఠశాలలో కొనసాగుతున్న మర మ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

కోటపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం మండల కేంద్రం లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలోని వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను ఆయన పరిశీలిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలను కల్పించిందన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్‌ ప్రహరీ లాంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించిం దన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికా హారాన్ని అందించాలని సూచించారు. బడిమానేసిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల లకు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న మూత్రశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సత్వరం పూర్తిచేయాలని ఎంపీడీ వో నాగేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మ య్య, ఏపీవో వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యా యులు మధునయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:32 PM