శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:40 PM
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవా లని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం వాంకిడి పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఎస్పీ కాంతిలాల్ పాటిల్
వాంకిడి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవా లని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పోలీసు అధికారులకు సూచించారు. శనివారం వాంకిడి పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీ సు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవనంతరం పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. పోలీసు స్టేషన్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.
లింగాపూర్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల తో పోలీసు సిబ్బంది మర్యాదగా మెలగాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీ స్‌స్టేషన్‌ను ఏఎస్పీ శనివారం తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించారలని, పోలీసు సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. గ్రామాల్లో సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ రికార్డులను, పోలీసు సిబ్బంది పరికరాలను పరిశీలించా రు. ఏఎస్పీ వెంట జైనూర్ సీఐ రమేష్, ఎస్‌ఐ గంగన్న, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:41 PM