ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - Jan 16 , 2025 | 10:23 PM

పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేశారని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాల యం నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామారావుపై కాంగ్రెస్‌ గుండాలు దాడి చేశారని, దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాల యం నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీసీపీకి వినతిపత్రం అందించారు.

ఆయన మాట్లాడుతూ జిల్లాలో యేడాది నుం చి ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. జయరామా రావుపై ముగ్గురు యువకులు దాడి చేయడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాలలో అలజ డులు సృష్టిస్తున్నారన్నారు. ఒక్క వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదన్నారు. నాయకులు అశోక్‌, పురుషోత్తం, వెంకటేశ్వర్‌గౌడ్‌, ముకేష్‌గౌడ్‌, ఆంజనేయులు, రాజు, హేమంత్‌రెడ్డి, లచ్చన్న, గురువయ్య, పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 10:23 PM