ఎస్టీపీపీ కొత్త యూనిట్‌కు.. రాజకీయ గ్రహణం
ABN, Publish Date - May 25 , 2025 | 11:26 PM
మంచిర్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగ రేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో కొత్త యూ నిట్ శంకుస్థానకు రాజకీయ గ్రహణం పట్టింది. కాం ట్రాక్టర్‌తో ఒప్పందం పూర్తయినా పనులు ప్రారంభిం చేందుకు మాత్రం నోచుకోవడంలేదు. దీనికి రాజకీయ అనిశ్చితే కారణమనే విమర్శలు ఉన్నాయి.
-ఒప్పందం పూర్తయినా శంకుస్థాపనకు నోచుకోని వైనం
-డిప్యూటీ సీఎం చేతులమీదుగా ప్రారంభానికి అయిష్టత..?
-ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
-మరో 800 మెగావాట్ల యూనిట్‌కు సింగరేణి సన్నద్ధం
మంచిర్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగ రేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో కొత్త యూ నిట్ శంకుస్థానకు రాజకీయ గ్రహణం పట్టింది. కాం ట్రాక్టర్‌తో ఒప్పందం పూర్తయినా పనులు ప్రారంభిం చేందుకు మాత్రం నోచుకోవడంలేదు. దీనికి రాజకీయ అనిశ్చితే కారణమనే విమర్శలు ఉన్నాయి. సింగరేణి సంస్థ తొలిసారిగా 2016 జనవరిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్టీపీపీలో తొలు త 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించడం ల క్ష్యంగా పెట్టుకోగా, అనతికాలంలోనే మరో 600 యూ నిట్లను విస్తరించి మొత్తం 1200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తోంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నుంచి తన సొంత అవసరాలకు 150 మెగావాట్లు వినియోగించుకుంటుండగా, మిగితా 1050 మెగావాట్ల వి ద్యుత్‌ను జెన్‌కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది.
ఫ అందుబాటులో వనరులు...
విద్యుత్ ఉత్పత్తిని సాధించడం కోసం ప్రధానంగా అవసరమైన బొగ్గు, నీరు అందుబాటులో ఉండడంతో ఎస్టీపీపీని ఏర్పాటు చేయగా, సుమారుగా రెండు వేల ఎకరాల భూములను సంస్థ రైతుల నుంచిసేకరించిం ది. 2015 సంత్సరాంతంలో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో 2011లో కాంట్రాక్టు అవార్డు చేయడం తో పాటు 2012 సంవత్సరంలో అభివృద్ధి పనులను సంస్థ ప్రారంభించింది. రూ.7,573 కోట్ల అంచనా వ్య యంతో (రెండు యూనిట్లు) 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తి చేయగా మరో రూ.6,700 కోట్ల అంచనా వ్యయంతో మూడో యూనిట్ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు చేసే లక్ష్యంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఫ గోదావరి నీరు తరలింపు
మొట్ట మొదటిసారిగా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన పెగడపల్లి సింగరేణి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన మూడు టీఎంసీల నీటిని గోదావరి, ప్రాణహిత నదుల నుంచి తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. గో దావరి నది నుంచిషెట్‌పల్లి, గంగిపల్లి, ఎల్కంటి, పెగ డపల్లి శివారుల మీదుగా ప్లాంట్ ఆవరణలో నిర్మించిన రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు. మిగితా 2 టీఎంసీల నీటిని కోటపల్లి మం డలం దేవులవాడ శివారు ప్రాణహిత నది నుంచి తరలించడం కోసం ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ఉత్పత్తికి అ వసరమై బొగ్గును శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు నుంచి త రలించేందుకు సంస్థ ప్రత్యేక రైలుమార్గాన్ని కూడా ఏ ర్పాటు చేసింది.
ఫ ఇప్పటికే పూర్తయిన టెండర్ ప్రక్రియ
ఎస్టీపీపీలో మూడో యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తికాగా, త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేర కు యాజమాన్యం హైద్రాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ సం స్థతో మూడు నెలల క్రితం ఒప్పందం చేసుకుంది. గత ఫిబ్రవరిలోనే ఈ కాంట్రాక్ట్‌ను బీహెచ్‌ఈఎల్ దక్కించు కోగా, అగ్రిమెంట్ పూర్తయిన నాటి నుంచి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా 40 నెలల్లోనే ప్లాంట్‌ను అందుబాటులోకి తేవాలని యాజ మాన్యం సన్నాహాలు చేస్తోంది.
ఫ శంకుస్థాపనలో తీవ్ర జాప్యం
ఎస్టీపీపీలో ఏర్పాటు చేయదలిచిన మూడో యూని ట్ విద్యుత్ ఉత్పత్తి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పనులకు శంకుస్థాపన చేయ నున్నట్లు 2024 మార్చి 12న హైద్రాబాద్‌లో భట్టి ప్రక టించారు కూడా. స్థానికంగా నెలకొన్న రాజకీయ అని శ్చితి కారణంగా డిప్యూటీ సీఎంతో కాకుండా నేరుగా ముఖ్యమంత్రితోనే శంకుస్థాపన చేయించాలనే ఆలోచ నలు చేస్తున్నట్లు సమాచారం. భట్టి విక్రమార్కకు మం చిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సన్నిహితుడు కావ డం, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానందకు ప్రేంసా గర్‌రావుతో మంత్రి పదవి విషయంలో అభిప్రాయ బే ధాలు ఉండడంతో ఇద్దరూ కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. మంత్రుల పర్యటన సం దర్భంగానూ ఒకరి నియోజక వర్గంలో మరొకరు అడు గు పెట్టడంలేదు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా మూడో యూనిట్ శంకుస్థాపన చేయిస్తే... భవిష్యత్తులో ఎస్టీపీపీలో ప్రేంసాగర్‌రావు ఉనికిని చా టుకునే అవకాశాలు ఉండడంతో నేరుగా సీఎంతోనే శంకుస్థాపన చేయించాలనే ఉద్దేశ్యంతో వివేకానంద ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎస్టీపీపీ మూడో యూ నిట్ శంకుస్థాపనలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ప్ర చారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌ను విస్తరిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. మూడో యూనిట్‌కు అవ సరమైన మరో 1200 మందికి కొత్త ఉద్యోగాలు లభిం చనున్నాయి.
Updated Date - May 25 , 2025 | 11:26 PM