ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ నిర్మాణ పనులు నిలిపివేత

ABN, Publish Date - May 19 , 2025 | 11:24 PM

మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఎదుట సర్వే నంబరు 876లో చేపట్టిన ఇంటి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడు తున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులు పనులను అడ్డుకోగా, తమపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇంటి యజ మాని, అతడి కుటుంబీకులు సోమవారం ఆందోళనకు దిగారు.

నిర్మాణ పనులు నిలిపివేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులు

- అధికారుల తీరుపై నిరసన

నెన్నెల, మే 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఎదుట సర్వే నంబరు 876లో చేపట్టిన ఇంటి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడు తున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులు పనులను అడ్డుకోగా, తమపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇంటి యజ మాని, అతడి కుటుంబీకులు సోమవారం ఆందోళనకు దిగారు. మెయిన్‌ రోడ్డు పక్కన కీసరి సాయికుమార్‌ అనేవ్యక్తి కంటేనర్‌ హౌజ్‌ నిర్మాణం చేపట్టగా ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతుందని ఫిర్యా దులు అందడంతో రెండు రోజుల కిందట బెల్లంపల్లి ఆర్డీవో ఇంటిని సీజ్‌ చేశారు. సాయికుమార్‌పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికి పనులు కొనసాగుతున్నాయని తెలుసుకున్న అధికారులు సోమవారం మరోసారి వెళ్లారు.

డిప్యూటీ తహసీల్దార్‌ ప్రకాష్‌, ఆర్‌ఐ సులోచన, ఎస్సై ప్రసాద్‌ సిబ్బందితో చేరుకొని పను లను నిలిపివేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే సీజ్‌ చేస్తామని చెప్పారు. సాయికుమార్‌తో పాటు అతడి తల్లి, భార్య పిల్లలు లోపలి నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. మహిళా పోలీసులు తల్లి సుశీలను బయటకు తీసుకురాగా ఆమె ఏడుస్తూ స్పృహ కోల్పో యింది. ఆమెను వెంటనే 108 అంబులెన్స్‌లో బెల్లంపల్లికి తరలిం చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిని సీజ్‌ చేయాల్సిం దేనని చెప్పి మిగతా వారిని కూడా బయటకు పంపి తాళాలు వేశా రు. తన భార్య ఒంటిపై బంగారం అమ్మి కొనుక్కున్న స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రాజకీయ నాయకుల ఒత్తిడితో పనులను అడ్డుకుంటు న్నారని కీసరి సాయికుమార్‌ వాపోయారు. తమను మాత్రమే టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - May 19 , 2025 | 11:24 PM