ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సికిల్‌సెల్‌ ఎనీమియా నివారణకు చర్యలు

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:23 PM

జిల్లాలో సికిల్‌సెల్‌ ఎనీమియా నివారణకు యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ తెలిపారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆర్డీవో, డీఎంహెచ్‌వో

- డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సికిల్‌సెల్‌ ఎనీమియా నివారణకు యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ తెలిపారు. ప్రపంచ సికిల్‌సెల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గిరిజన సంఘాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ 2047 నాటికి సికిల్‌ సెల్‌ ఎనిమియాను పూర్తిగా నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలోని దండేపల్లి, కాసిపేట, తాళ్లపేట, మందమర్రిలోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 40 సంవత్సరాలలోపు వయసుం్స గల వారందరికీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వచ్చే వ్యాధులపై ప్రజలకు అహగాహన కల్పిస్తున్నామన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా నివారణ కోసం ప్రతి ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు పెంచేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్‌, వైద్యాధికారులు సుధాకర్‌నాయక్‌, అనిత, కృపాబాయి, వెంకటేశ్వర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహన ఉండాలి

నెన్నెల (ఆంధ్రజ్యోతి): సికిల్‌సెల్‌ అనిమియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. సికిల్‌సెల్‌ అనిమియా దినోత్సవం సందర్భంగా గురువారం జంగాల్‌పేటలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకిన వారిలో రక్తహీనత తలెత్తుతందని, రోగనిరోధనక శక్తి తగ్గడంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుందన్నారు. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో తర్వాతి తరాలకు జబ్బు సంక్రమించకుండా జాగ్రత్తపడవచ్చని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌, ఎపీఎం విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఉచితంగా వైద్య సేవలు

కాసిపేట (ఆంధ్రజ్యోతి): సికిల్‌ సెల్‌ వ్యాధిన భారిన పడిన వారికి ప్రభుత్వం తరుపున ఉచితంగా వైద్య సేవలు అందుతాయని కాసిపేట మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవి కిరణ్‌ అన్నారు. గురువారం ప్రపంచ సికిల్‌సెల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రిలో రోగులకు సికిల్‌సెల్‌పై అవగాహన కల్పించారు. సికిల్‌సెల్‌ భారినపడ్డవారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. వారి పర్యవేక్షణలో ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు వ్యాధి ఉన్న వారికి యూనిక్‌ డిజెబుల్‌టీ ఐడెంటిఫికేషన్‌ కార్డు ఇస్తామన్నారు. దీనిని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సికిల్‌ బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పారామెడికల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:23 PM