బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే
ABN, Publish Date - Jan 03 , 2025 | 11:24 PM
బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్య కోసం మొట్టమొదటి బాలికల పాఠశాల స్ధాపించారన్నారు. ఫూలే జయంతిని ప్రభుత్వం అధికా రికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బెల్లంపల్లి,(ఆంధ్రజ్యోతి): సావిత్రిబాయి ఫూలే ఆశయసాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు. మున్సిప ల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు బండి ప్రభాకర్, నీలి కృష్ణ, అప్సర్ పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 11:24 PM