ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీలు స్వీకరించి.. భరోసా కల్పించి..

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:34 PM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన ధరఖాస్తులను త్వరగా పరిష్క రించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తు లు స్వీకరించారు.

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే - సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశం

ఆసిఫాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన ధరఖాస్తులను త్వరగా పరిష్క రించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తు లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దరఖాస్తు లను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌సెల్‌ ప్రారం భించడం జరిగిందని ఇతర రోజుల్లో గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీ లు సమర్పించవచ్చని తెలిపారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమంలో అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు..

- జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కోవ దాదారావు తన తండ్రి కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఈ విషయమై చర్యలు తీసుకొవాలని అర్జీ సమర్పించారు.

- ఆసిఫాబాద్‌ పట్టణం రవిచంద్రకాలనీకి చెందిన లలిత, ఆసిఫాబాద్‌ మండలం గోవింద్‌పూర్‌ గ్రామానికి చెందిన వైరగాడే జాగ్రుబాయి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.

- కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన కవిత మండల్‌ తమ భూమి ఇతరులు అక్రమంగా కబ్జా చేసినందున తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

- కెరమెరి మండలం కరంజివాడకు చెందిన కుమ రం లక్ష్మిబాయి తనకు జారీ చేసిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా లో ఇతరుల ఆధార్‌ నంబరు నమోదు కావడంవల్ల ప్ర భుత్వ రాయితీలు రావడంలేదని సవరించాలని కోరారు.

- బెజ్జూరు మండలం సోమిని గ్రామా నికి చెందిన గిరిజనులు తమకు ప్రధాన మంత్రి అవాస్‌ యోజన కింద ఇల్లు మం జూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

- బెజ్జూరు మండలం మర్తిడి గ్రామా నికి చెందిన ఈశ్వరయ్య 30 ఏళ్ల క్రితం కొనుగొలు చేసిన భూమికి పట్టా మం జూరు చేసి పాస్‌పుస్తకం జారీ చేయాలని అర్జీ సమర్పించారు.

- ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో బీసీ బాలికల పోస్టుమెట్రిక్‌ వసతి గృహన్ని వెంటనే ప్రారంభించాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దినకర్‌ దరఖాస్తు సమర్పించారు.

- ఆసిపాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భూమి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని కళాశాలకు ప్రహరీ నిర్మించాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అర్జీ సమర్పించారు.

వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, టీఏజీఎస్‌ల ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.

Updated Date - Jul 14 , 2025 | 11:34 PM