సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య
ABN, Publish Date - Jul 02 , 2025 | 11:34 PM
సర్యారు బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని డీఈ వో యాదయ్య తెలిపారు. వేంపల్లిలో పదేళ్ల్లుగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలను బుధవారం డీఈవో యాదయ్య పునః ప్రారంభించారు.
- డీఈవో యాదయ్య
- పదేళ్ల క్రితం మూతపడ్డ ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభం
హాజీపూర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సర్యారు బడుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని డీఈ వో యాదయ్య తెలిపారు. వేంపల్లిలో పదేళ్ల్లుగా మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలను బుధవారం డీఈవో యాదయ్య పునః ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్యజయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా 10 మం ది విద్యార్థులు చేరగా పాఠశాలను పునఃప్రా రంభించడం సంతో షంగా ఉందన్నారు ప్రైవేటు పాఠశాలకు దీటుగా సర్కారు బడు ల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చే ర్పించాలని కోరారు.
అనంతరం నంనూర్ మం డలపరిషత్ ప్రాథమిక పాఠ శాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ప్రతిభకనబరిచిన విద్యార్థులను చప్పట్లతో ప్రోత్సహించారు. కార్యక్ర మంలో సెక్టోరియల్ అధికారులు చౌదరి, సత్యనారాయణ, ఎంఈవో తిరుపతిరెడ్డి, మండల నోడల్ అధికారి హనుమాండ్లు, హెచ్‌ఎం సుధారా ణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
15 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సర్కారు బడి
దండేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల లోనే నాణ్యమైన విద్యను అందిస్తుందని దండేపల్లి మండల విద్యాధికారి దుర్గం చిన్నయ్య, ఎస్సై ఎండీ తహసీనోద్దీన్ అన్నారు. దండేపల్లి మండలం కొత్తమా మిడిపల్లి గ్రామంలో 15ఏళ్ల కిత్రం విద్యార్ధులు లేక మూతబడింది. బడిబాటలో భాగంగా 20మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. దీంతో గ్రామస్థులతో కలిసి అధికారులు, నాయకులు పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పాఠశాల పునః ప్రారంభానికి గ్రామస్థు లు కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గడ్డం నాగరాణి త్రిమూ ర్తి, స్కూల్ కాంఫ్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందుల శ్రీనివాస్, మాజీ సర్పంచు గడ్డం రాజయ్య, నాయకులు గడ్డం రాంచందర్, బత్తుల రమేష్, అక్క ల కృష్ణ, ఎంఐసి నగేష్, సీఆర్‌పి గరిగే నర్సయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 11:35 PM