ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన

ABN, Publish Date - Jan 05 , 2025 | 11:09 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం గూడెం ఎత్తిపోతల నీటిని ఆదివారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణతో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.

దండేపల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం గూడెం ఎత్తిపోతల నీటిని ఆదివారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణతో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రైతుభరోసా పథకం ప్రారంభించను న్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గూడెం ఎత్తిపోతల పథకం ఒక బృహత్తర పథకమని, ఆయకట్టు రైతులకు గూడెం ఎత్తిపోతల పథకం వరంలాంటిదన్నారు. వారబంధి పద్ధ తిలో నీళ్లు అందిస్తున్నందున రైతులు పరస్పరం సహకరిం చుకోవాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తిన ప్పుడు వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాల న్నారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంటల సాగు కోసం మండలం తానిమడుగు డి30 నుంచి హాజీపూర్‌ మండలం డి42 డిస్ట్రిబ్యూటర్‌ వరకు సుమారు 17,500వేల ఎకరాల పంటలకు నీరు అందుతుందన్నారు. ఏప్రిల్‌ 27వరకు ఆరుతడి పంటలకు సాగునీరు అంది స్తామన్నారు. లక్షెట్టిపేట వ్యవపాయ మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ దాసరి ప్రేమ్‌చందు, వైస్‌ చైర్మన్‌ ఎండి ఆరీఫ్‌, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ నాగరాణిత్రిమూర్తి, ఎంపీడీవో ప్రసాద్‌, డీటీ విజయ, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ రవీందర్‌, డీఈలు దశరథం, వెంకటేశం, ఏఈలు రాజేందర్‌, జాకీర్‌, కీర్తి, సంజీవ్‌, శ్రావణి, నాయకులు వెంకటేశ్వర్లు, సతీష్‌. పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:09 PM