జీవో 49 పూర్తిగా రద్దు చేసే వరకు ఆందోళన
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:46 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు చేయాలని తీసుకువచ్చిన జీవో నంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 22(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు చేయాలని తీసుకువచ్చిన జీవో నంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని ప్రజలను పీడించే రాక్షస పాలన అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే జీవో నంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చులకనగా కనపడుతున్నారని, జల్ జంగల్ జమీన్ హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం స్ఫూర్తితో జీవోను పూర్తిగా రద్దు చేసే వరకు ఎంతకైనా పోరాడుతామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సరస్వతి, పోచయ్య, శంకర్, కిష్టయ్య, రవీందర్, అహ్మద్, నిసార్, సాజిద్, భీమేష్, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 11:46 PM