గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:28 PM
రాష్ట్ర గిరిజనుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
జైనూర్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజనుల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని డీఎస్‌ఎస్ భవనంలో సోమవారం నిర్వహించిన ఏడో గిరిజన మండలి సమావేంలో ఆసిఫాబాద్ ఎమ్యెల్యే కోవ లక్ష్మి పాల్గోని గిరిజన సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ రోడ్డు పునర్నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పేద లబ్ధిదారులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అనేక మంది ఉన్నారని వారు ఆర్థిక స్థోమత లేక ఇళ్లు కట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ముందస్తుగా లక్షల రుపాయలు మంజురు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై లోతైన చర్యలు జరపాలని, గిరిజనులు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించడంలో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. దీంతో పాటు అటవీ హక్కుల చట్టం అమలు, పోడు భూముల సమస్యల పరిష్కారం, గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై సరైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలని ఆమె కోరారు. గిరిజనుల సంస్కృతిసంప్రాదాయలను పరిరక్షించి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి ఆవకాశాలపై దృష్టి సారించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు తగిన ప్రోత్సాహం అందించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనులు ఉన్నతి కోసం సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి వాటిని పకడ్బందీగా అమలు చేయాలని, ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 11:28 PM