రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:12 PM
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయిన వాహనాలను హైవే మొబైల్ వాహనాల ద్వారా క్లియర్ చేయాలని ఆదేశించారు. రహదారులపై కేజ్‌వీల్స్ వినియోగాన్ని నిర్మూలించే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రహదారులపై పశువులు వస్తే పశువుల యాజమానులకు జరిమానాలను విధించాలని సూచించారు. మంచిర్యాల పట్టణం, నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మూలమలుపులు, యూ టర్న్‌ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి వాహనాల వేగ నియంత్రణ, సూచిక బోర్డులు, రేడియమ్స్, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించచారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్, ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ ప్రకాష్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, రోడ్లు భవనాలు, మున్సిపల్ , పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 10:12 PM