‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:36 PM
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికా రుల సమన్వయంతో త్వరగా పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వ ర్‌రావుతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యో తి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికా రుల సమన్వయంతో త్వరగా పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వ ర్‌రావుతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
రెబ్బెన మండలం ఎడవెల్లికి చెందిన డబ్లి తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. పెంచికలపేట మండ లం చెడ్వాయి గ్రామానికి చెందిన రాజయ్య తాను దివ్యాంగుడినని తనకు మూడు చక్రాల బండి మంజూరు చేయాలని దరఖాస్తు అందజే శారు. కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ -2కు చెందిన సుమ మల్లిక, వాంకిడి మండలం జైత్‌పూర్‌కు చెందిన వెంకట్రావు, రెబ్బెన మండ లం జక్కులపల్లికి చెందిన కూలీలు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరు తూ అర్జీ సమర్పించారు. దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన షెడ్యూల్ తెగలు, పర్దాన్ కులమకు చెందిన రైతులు తాము సాగు చేసిన భూమిని ఇతరులు ఆక్రమించార ని న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన పార్వతి తనకు తాటిపల్లి శివారులో దళిత బస్తీలో వచ్చిన భూమిని కొల తలు చేసి హద్దులు నిర్ణయించాలని, ఆసిఫాబా ద్ పట్టణంలోని జన్కాపూర్‌కు చెందిన అమీనా బేగం తన భర్త మరణించినందు తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాల ని దరఖాస్తు అందజేశారు. మంచిర్యా ల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుశీల రెబ్బెన మండలం నేర్పుల్లి శివారులోని సర్వే నెం.32/1, 37/1లలో 2.30 ఎకరాల భూమిని కొంత మంది ఆక్ర మించుకున్నారని వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని విన్న వించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన స మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన మహో త్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిర్దేశిం చిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని, 51 లక్షల మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. గ్రామపంచాయతీల్లో నర్సరీలు, అటవీ శాఖ నర్సరీల్లో లక్ష్య సాధనకు అనుగుణంగా మొక్క లు అందుబాటులో ఉన్నాయని అధికారులు సమన్వయంతో కృషి చేసి లక్ష సాధన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:36 PM