ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:43 PM

ప్రతీ రోజు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత పొందవచ్చని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

ఆసిఫాబాద్‌లో యోగాసనాలు వేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఆసిఫాబాద్‌, జూన్‌ 21( ఆంధ్రజ్యోతి): ప్రతీ రోజు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత పొందవచ్చని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి హాజరై యోగాసనాలను సాధన చేశారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ రామానుజం, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా ఆసనాలు వేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ, కోర్టు సిబ్బంది పాల్గొని యోగా ఆసనాలు వేశారు. ఆసిఫాబాద్‌ స్పెషల్‌ సబ్‌ జైలులో యోగా శిక్షకుడు దొడ్డజీ ఖైదీలతో యోగా ఆసనాలను వేయించారు. కార్యక్ర మంలో జైలు సూపరింటెండెంట్‌ ప్రేంకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో బీజేపీ సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు పాల్గొని విద్యార్థులతో యోగా ఆసనాలను వేయించారు. పట్టణంతో పాటు మండలంలో వివిధ పాఠశాలలు వసతి గృహాలు, గురుకులాల్లో యోగా దినోత్సవా

Updated Date - Jun 21 , 2025 | 11:43 PM