ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజారక్షణకు చర్యలు

ABN, Publish Date - May 26 , 2025 | 11:21 PM

వర్షాకాలం రాబోతున్నందున ప్రకృతి వైప రీత్యాల నుంచి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదే శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పక్కన అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లా

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం రాబోతున్నందున ప్రకృతి వైప రీత్యాల నుంచి ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదే శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో తహసీల్దార్లు, నీటి సరఫరా, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ అధికా రులతో ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలం రాబోతుం దని, జిల్లాలోని లోతట్టు గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారక్షణ దిశగా చర్యలు తీసుకో వాలని తెలిపారు. వర్షాల కారణంగా ఏర్పడే వరద ప్రభావంతో రహదారులు దెబ్బతినకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో జిల్లాలో ఏర్పడే ప్రకృతి వైపరీత్యాల పరిస్థితుల్లో అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలకు భరోసా అం దించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.

సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

లైసెన్స్‌ సర్వేయర్లకు అందిస్తున్న శిక్షణను సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో లైసెన్స్‌ సర్వేయర్‌ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు భూ భారతి చట్టం, భూమి కొలతలపై రెండు నెలల శిక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా భూమి కొలతల అధికారి సోమేశ్వర్‌తో కలిసి హారజ య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి నూతన ఆర్‌వోఆర్‌ చట్టంలో సర్వేయర్ల పాత్ర కీలకమైం దన్నారు. భూ భారతి చట్టంతో పాటు భూమి కొలతల లో ప్రతీఅంశంపై అవగాహన ఉండాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలి

జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను త్వర గా పూర్తిచేయాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే సూచించారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు అంశం పై జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార శాఖల అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశించిన ప్రకారం రైతుల వద్ద నుంచి ధాన్యం కొను గోలు చేయాలని తెలిపారు. కొను గోలు కేంద్రాలలో రైతులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని, సమన్వ యంతో లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్‌ మిల్లులకు తరలించాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన రైతు యువ వికాసం పథకంలో భాగంగా అర్హుల జాబితా తయారు చేయాలని, జాబితా రూపక ల్పనలో వందశాతం పారదర్శకంగా వ్యవహరించాల న్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా అర్హుల జాబితా తయారు చేసి అందించాలని ఆదేశించారు.

వంద శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలి

జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ సంస్థలో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో తెలంగాణ మైనార్టీ విద్యా సంస్థలలో అడ్మిషన్లకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మైనార్టీ రెసిడెన్షి యల్‌ సంస్థలో వంద శాతం అడ్మిషన్లు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభు త్వ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి కల్పిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఎంఏ నదీం, ఆర్‌ఎల్‌సీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:21 PM