మాజీ ఎమ్మెల్యే అసమర్థతతోనే మంచిర్యాల వెనుకబాటు
ABN, Publish Date - May 25 , 2025 | 11:23 PM
మంచిర్యాలక్రైం, మే25(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల అన్ని విధాలుగా వెనుకబాటుకు దివాకర్‌రావు అసమర్థత పాల నే అని ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరం గా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలనలో చేతకాని దివాకర్ రావు అభివృద్ధిని ఓర్వలేక విమర్శించడం సరికాదన్నారు.
- అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరం
- ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, మే25(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల అన్ని విధాలుగా వెనుకబాటుకు దివాకర్‌రావు అసమర్థత పాల నే అని ఆయన అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరం గా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలనలో చేతకాని దివాకర్ రావు అభివృద్ధిని ఓర్వలేక విమర్శించడం సరికాదన్నారు. మంచిర్యాలలో విద్యా, వైద్య సేవలు విస్తృత పరుస్తూ రహదారులు విస్తరింపచేస్తుంటే ఓర్వలేక విమర్శలు చే స్తున్నారని ద్వజమెత్తారు. తన ఇంటి ముందు రైల్వే ఓ వర్‌బ్రిడ్జీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగడం మాజీ ఎమ్మెల్యే సహించలేకపోతున్నారన్నారు. వేంపల్లిలో పరిశ్రమల ని లయం ఏర్పడడం ఆయనకు కంటగింపుగా ఉందన్నారు. ఐటీ పార్కును అడ్డగిస్తాననడం అభివృద్ధి నిరోదకమే అ న్నారు. ఐటీ పార్కు అయితే వందలాది మంది నిరుద్యో గులకు ఉపాధి కల్పిస్తుందని గుర్తు చేశారు. భూనిర్వాసి తులకు సంతోషకరమైన ప్యాకేజీ ఇస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు విజిత్‌రావు గురించి ప్రజలకు తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఎన్ని విమర్శలు చేసిన, ఎన్ని ఆరోప ణలు చేసిన మంచిర్యాలను విద్యా, వైద్యపరంగా అభివృద్ధి చేసి తీరుతానన్నారు. ఎల్లంపల్లి భూనిర్వాసితులకు ఎంత వరకు న్యాయం చేశావో బహిరంగంగా తెలుపాలని స వాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఇందిరమ్మ రాజ్యమేఅని ఽధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి, తాజా మాజీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 11:23 PM