ఏబీ బర్దన్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:16 PM
కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్దన్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బర్దన్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్దన్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బర్దన్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు కలవేన శంకర్ మాట్లాడుతూ బర్దన్ చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుస రించి ప్రజలతో, కార్యకర్తలతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. నాయకులు రామ డుగు లక్ష్మణ్, కలీందర్‌ఖాన్, మల్లయ్య, నగేష్, రవి, పౌలు, పోచన్న, శంకరయ్య, రామన్న, నర్సయ్య, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో కామ్రేడ్ బర్దన్ వర్ధంతిని సీపీఐ నాయకులు నిర్వహించారు. బర్దన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ కార్యదర్శి రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్యలు మాట్లాడుతూ ప్రజల హక్కుల సాధనకు బర్దన్ ఎన్నో పోరాటాలు చేశారన్నారు. 1957లో నాగాపూర్ అసెంబ్లీ స్ధానానికి పోటీ చేసి గెలిచారన్నారు. 16 సంవత్సరాలు పార్టీ కార్యద ర్శిగా పనిచేసి కార్మికులు, ప్రజల సమస్యల పరి ష్కారానికి పోరాటాలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. నాయకులు లక్ష్మీనారా యణ, గుండ చంద్రమాణిక్యం, మేకల రాజేశం, కొంకుల రాజేష్, రత్నం రాజం, రాంచందర్, నాయకులు స్వామిదాస్, రాజమల్లు,రాధాకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Jan 02 , 2025 | 11:16 PM