ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:30 PM

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లను నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లను నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం గోవిందాపూర్‌ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పకథం ద్వారా అర్హులైన నిరుపేదలకు గూడు కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని బేసిమెంట్‌ స్థాయి వరకు పూర్తయిన నిర్మాణాలకు సంబంధిత బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను తర్వరగా చేయాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న బోజనం నాణ్యత, వంట పాత్రలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని సందర్శించి దివ్యాంగులకు అందిస్తున్న సేవలు, శిబిరం నిర్వహణ తీరును పరిశీలించారు. సదరం శిబిరానికి హాజరైన వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా ధ్రువపత్రాలు జారీచేయాలని ఆదేశించారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:30 PM