ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గూడులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:25 PM

గూడలేని నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని గృహ నిర్మాణ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాన్సీలాల్‌ కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న పీడీ బన్సీలాల్‌

గృహ నిర్మాణ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాన్సీలాల్‌

దండేపల్లి జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గూడలేని నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని గృహ నిర్మాణ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ బాన్సీలాల్‌ కోరారు. గురువారం దండేపల్లి మండల పరిషత్‌ కార్యలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఎంపీడీవో ప్రసాద్‌తో కలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బన్సీలాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చూపించిన కొలత ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ దశలోనే ఇంటి విస్తీర్ణం, ఏయే విడతలో డబ్బులు ఏవిధంగా వస్తాయే ముందే వారికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జేఆర్‌ ప్రసాద్‌, ఎంపీవో విజయప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

జన్నారం: మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని హౌజింగ్‌ పీడీ బన్సీలాల్‌ సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో సమావే శం నిర్వహించారు. అనంతరం మండలంలోని కామనపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్లన నిర్మాణాలను పరిశీలించాలన్నారు. బిల్లులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో షరీఫ్‌, ఏఎంసీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:25 PM