ఆపరేషన్ కగార్ పేరుతో.. బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం దుర్మార్గం
ABN, Publish Date - May 28 , 2025 | 11:37 PM
ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం దుర్మార్గమైన చర్యఅని అరుణోదయ కళాకారిణి, ప్రజాఉద్యమాల పోరాటసమితి అధ్యక్షురాలు విమ లక్క పేర్కొన్నారు.
చెన్నూరు, మే 28 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం దుర్మార్గమైన చర్యఅని అరుణోదయ కళాకారిణి, ప్రజాఉద్యమాల పోరాటసమితి అధ్యక్షురాలు విమ లక్క పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు పట్టణం లోని పద్మశాలి భవన్‌లో ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి పోచమల్లు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకు డు కాంతయ్య ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమ సభ లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నక్సలై ట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం సరైంది కాదన్నారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని పేర్కొన్నారు. నక్సలైట్ల పేరుతో అమా యక ఆది వాసీ గిరిజనులపై మారణహోమం సాగించడం ఆపాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులను, 1/70చట్టాన్ని కాపాడాలని కోరారు. అడవి సంపద ను, ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా సల్వాజుడుం, ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఎన్‌కౌంటర్లు చేస్తూ చనిపోయిన వారి మృతదేహాలను కూడా బంధువులకు అప్పగించకపోడం దుర్మార్గమన్నారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనం తరం ర్యాలీగావెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ రాష్ట్ర నాయ కులు ప్రసాద్, నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం, ఐఎఫ్‌టీయూ రాష్ట్రకార్యదర్శి భాస్కర్, విశ్వనాధ్, సత్యం, ఆదివాసీ నాయకులు కుమార్, సాధు, మల్లన్న, అంజయ్య, చంద్రశేఖర్, జైపాల్ సింగ్, బోడంకి చందు, చంద్రశేఖర్, పౌలు, సమ్మ య్య, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 28 , 2025 | 11:37 PM